గోక్కొని తినే వాళ్ల దగ్గర పీక్కొని తింటారా లోకేష్ బాబూ!

వృద్ధులకు, వికలాంగులకు ఇచ్చే పెన్షన్లను కూడా మీ వాళ్లు వదలడం లా.. మీ పార్టీ తద్దిన కార్యక్రమం వచ్చినప్పుడల్లా, వారికి ప్రభుత్వ ఖాతా నుంచి ఇచ్చే డబ్బులో కోత విధించి మీ పార్టీ సభ్యత్వ కార్డును వారి చేతిలో పెడుతున్నారు. పెన్షన్ కావాలంటే, తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవాల్సిందే. గోక్కొని  తినే వాళ్ల దగ్గర పీక్కొని తినడం అంటే ఇదే మరి.

అదేమంటే.. ఆ మాత్రం కట్టలేరా, వంద రూపాయలే కదా, తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవాల్సిందే, అని వృద్ధుల, వికలాంగులపై మీ వాళ్ల రుబాబు కొనసాగుతోంది. పల్లెల్లో పెన్షన్లను పంపిణీ చేసే హక్కును, ఎవరికీ పెన్షన్లు ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో.. చెప్పే హక్కును జన్మభూమి కమిటీ రూపంలోని మీ పచ్చ చొక్కాలకే ఇచ్చారు. వాళ్లేమో నిర్భంధ తెలుగుదేశం సభ్యత్వ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు.

ఇక అదే అనుకుంటే.. మీ పార్టీ సభ్యత్వానికీ, రేషన్ సరుకులకు ముడి పెట్టారు. దేశం ఎంతో ప్రగతి సాధించిందని చెబుతున్నారు కానీ, ఇప్పటికీ స్టోర్ బియ్యం లేకపోతే నాలుగు వేళ్లూ నోటికెళ్లని వారి జనాభా ఏపీలోనే ఎంతో ఉంది. మరి అలాంటి వారిపై ‘మీకు ఇక రెగ్యులర్ గా రేషన్ కావాలంటే.. వంద రూపాయలు అదనంగా తీసుకురావాల్సిందే..’ అంటూ, ఆ వంద రూపాయలూ.. తెలుగుదేశం సభ్యత్వం కోసమని కొందరికి చెప్పి, మరికొందరికి చెప్పక.. మరో రకంగా నిర్భంధ తెలుగుదేశం సభ్యత్వ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. 

ఇలాంటి దారుణానికి సంబంధించి లోకేష్ బాబు ఇప్పుడొచ్చి అధికారిక ప్రకటన చేశాడు. రాష్ట్ర జనాభాలోని, ఓటర్లలో పదిహేడు శాతం మందికి టీడీపీ సభత్యం ఇస్తామని చెప్పుకున్నాడు. పార్టీ తరపున రొటీన్ గా జరిగే ఈ తద్దిన కార్యక్రమం విజయవంతం అయ్యిందని చెప్పుకున్నాడు.

మరి ఈ 17 శాతంలో రేషన్ కార్డు హోల్డర్లు ఎంతమంది? పెన్షన్ మీద ఆధారపడ్డ ముసలీ ముతక నుంచి మీరు నిర్బంధంగా వసూళు చేసి ఇచ్చిన సభ్యత్వాలు ఎన్ని? ఈ గణాంకాలు కూడా విడుదల చేస్తే బాగుంటుంది. 

Show comments