రాఖీసావంత్‌ని మించిపోయిందోచ్‌.!

పబ్లిసిటీ స్టంట్లు చేయడంలో బాలీవుడ్‌ ఐటమ్‌ బాంబ్‌ రాఖీసావంత్‌ మాస్టర్‌ డిగ్రీ సంపాదించేసింది. తెలుగులోనూ రాఖీ సావంత్‌ ఒకటి రెండు సినిమాల్లో ఐటమ్‌ సాంగ్స్‌ చేసిందండోయ్‌. నటిగా తెచ్చుకున్న పాపులారిటీ మాటేమోగానీ, వివాదాలతో ఈమె దక్కించుకున్న పబ్లిసిటీ, తద్వారా వచ్చిన పాపులారిటీనే ఎక్కువ. 

'రాఖీ కా స్వయంవర్‌' ఆమె పబ్లిసిటీ స్టంట్స్‌కి పరాకాష్ట. ఆ తర్వాత బాయ్‌ఫ్రెండ్‌ తనను ముద్దుపెట్టుకున్నాడంటూ రచ్చ రచ్చ చేసింది. చెప్పుకుంటూ పోతే, రాఖీసావంత్‌ పబ్లిసిటీ స్టంట్స్‌ బాగోతం ఎప్పటికీ తరిగిపోని చరిత్రలాంటిదేమో. అలాంటి రాఖీ సావంత్‌నే మించిపోతోందిప్పుడు, మరో సెక్సీభామ సోఫియా హయాత్‌. 

చిత్రమైన విషయమేంటంటే, ఇప్పుడు సోఫియా హయాత్‌ హిందూ భక్తురాలిగా మారిపోయింది. కాదు, కాదు.. ఏకంగా పరమశివుడికి తల్లి అయిపోయింది. అదెలా.? అనడక్కండి. అదంతే. దేవుడు కలలో కన్పించాడు, సన్యాసినిగా మారిపోయింది. ఏ మతానికి చెందిన సన్యాసినివి.? అని అడిగితే, 'సర్వమతాల సారాంశం ఒక్కటే' అని తప్పించుకుంది సోఫియా హయాత్‌. ఇప్పుడేమో, హిందూ మతానికి తానే ఆద్యురాలినన్నట్లుగా మాట్లాడేస్తోంది. హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసొచ్చిందట. శివుడికి జన్మనిచ్చింది తానేనని చెబుతోంది. చూస్తోంటే, సన్యాసం వేషం కట్టింది పబ్లిసిటీ స్టంట్లు చేయడానికో.. లేదంటే, మతిభ్రమించి ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడుతోందో ఎవరికీ అర్థం కావడంలేదు. 

మొన్నటికి మొన్న సన్యాసినిగా మారిపోయానని చెప్పుకోడానికి, అత్యంత జుగుప్సాకరంగా అంతకు ముందు వరకు తన ఎదయెత్తుల్ని పెంచుకోడానికి ఉపయోగించిన సిలికాన్‌ ఇంప్లాంట్స్‌ని మీడియా ముందు ప్రదర్శించింది. 'వీటితో నాకు ఇకపై అవసరం లేదు' అని సోఫియా చెప్పినప్పుడు అంతా షాక్‌కి గురయ్యారు. ఇప్పుడే ఇన్ని షాక్‌లు ఇస్తోంటే, ముందు ముందు సోఫియా ఇంకెలాంటి షాక్‌లు ఇవ్వనుందో ఏమో.! Readmore!

Show comments

Related Stories :