వెంకటేష్...గురు

గురు అనగానే మేటి నటుడు కమల్ హాసన్ అలనాటి మేటి చిత్రం చటుక్కున గుర్తుకు వస్తుంది. అలాంటి పవర్ ఫుల్ టైటిల్ తో మళ్లీ మరో సినిమా రాబోతోంది. వెంకటేష్ హీరోగా రూపొందే సినిమాకు ఈ టైటిల్ ను ఫిక్స్ చేసారు. ఇరిధిసుట్రు అనే తమిళ సినిమా ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది. 

హిందీ సినిమా సాలా ఖండూస్ కు ఇదే మాతృక. అయితే హిందీ సినిమాలో కొన్ని మార్పులు చేసారు. ఆ మార్పులు లేకుండా తమిళ మాతృకనే తెలుగులోకి తీసుకువస్తున్నారు. బాలీవుడ్ సినిమాలో హీరోయిన్ గా నటించిన రీతికా సింగ్ నే తెలుగులో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. 

సుధా కొంగర దర్శకత్వం వహించే ఈ సినిమాను పివిపి సంస్థ నిర్మిస్తుంది. తమిళ సినిమాలో మాధవన్ పోషించిన బాక్సింగ్ మాస్టర్ పాత్రనే వెంకీ పోషిస్తున్నాడు. అందుకే గురు అన్న టైటిల్ ఏప్ట్ గా వుంటుందని ఫిక్స్ చేసారు.

Show comments