రెండు నాల్కల 'పచ్చ'పాము.!

అదో 'పచ్చ' పార్టీ. దానిది రెండు కళ్ళ సిద్ధాంతం. ఉమ్మడి తెలుగు రాష్ట్ర విభజన సమయంలే అదే రెండు కళ్ళ సిద్ధాంతం పాటించింది. విభజనకు మేం 'సై' అంటూ ముందుకొచ్చి, విభజనకు కారణమైన ఆ పార్టీ 'విభజన పాపానికి ఒడిగట్టింది కాంగ్రెస్‌' అంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్ని వంచించింది. పాముకు పాలు పోస్తే విషం చిమ్ముతుందో లేదోగానీ, పచ్చ పార్టీ మాత్రం అదే పని చేసింది. రెండు కళ్ళ సిద్ధాంతం.. రెండు నాల్కల ధోరణి.. వీటన్నిటికీ పేటెంట్‌ హక్కులైతే ఆ పార్టీనే సొంతం చేసుకుంది. 

సీన్‌, పార్లమెంటులో.! ఈసారి అదే పచ్చ పార్టీకి చెందిన ఓ ఎంపీ, 'ఆంధ్రప్రదేశ్‌కి అత్యంత కీలకమైనది ఆ బిల్లు..' అంటూ ప్రత్యేక హోదా బిల్లుపై గళం విప్పారు. ఏంటీ ఈ వైపరీత్యం.? ఇదంతా నిజమేనా.? అని అంతా ఆశ్చర్యపోయారు. ముందే చెప్పుకున్నాం కదా, పచ్చ పార్టీ అంటేనే రెండు నాల్కల ధోరణికి నిదర్శనమని. ఇంకో 'పచ్చ' నాయకుడు మీడియా ముందుకొచ్చాడు. ఆ బిల్లు చిత్తు కాగితంతో సమానమనేశాడు నిస్సిగ్గుగా. 

నిజమే, ప్రైవేటు బిల్లుతో ఒరిగేదేమీ వుండదు. ఇది జగమెరిగిన సత్యం. కానీ, దేశం దృష్టిని ఈ బిల్లు ఆకర్షించింది కదా.! వామపక్షాలు, అధికార పక్షాన్ని నిలదీశాయి.. చాలా జాతీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్‌కి జరిగిన అన్యాయంపై గళం విప్పకపోయినా, అన్యాయం నిజమేనని ఒప్పుకున్నాయి. ఇదంతా కేవలం ఒక్క ప్రైవేటు బిల్లుతోనే జరిగింది. అది రాజకీయ కోణంలో ప్రవేశపెట్టిన బిల్లే కావొచ్చు, కానీ.. దాని ద్వారా ఆంధ్రప్రదేశ్‌ సమస్య ఏమిటో పార్లమెంటుకు తెలిసింది కదా.! 

అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు.. అన్నట్లు తయారయ్యింది 'పచ్చ' పార్టీ పరిస్థితి. రెండు పచ్చ నాలికల్లో ఒకటేమో ఆ బిల్లు ఆంధ్రప్రదేశ్‌కి అత్యంత కీలకం అని నినదిస్తుంది. ఇంకో నాలికేమో అది చెత్త కాగితమని చెబుతుంది. ఇంకా చిత్రమేంటంటే ఇంతకన్నా దిగజారుడుతనం ఇంకేముంటుంది.? రాజకీయ వ్యభిచారం అనాలా.? రాజకీయ దిగజారుడుతనం అనాలి.? ఇంతకన్నా తీవ్రమైన పదజాలం ఇంకేదన్నా ఉపయోగించాలా.! 

ఆ రెండు పచ్చ నాలికలూ ప్రజాబలంతో పదవులు పొందలేదు, ధన బలంతో పదవుల్ని కొనుక్కున్నాయనంటారు. అంతే మరి, అందుకే.. వాటికి ప్రజల సెంటిమెంట్లతో సంబంధం లేదు. ఎనీ డౌట్స్‌.?

Show comments