‘హోదా పోరాటం’లో పసుపు మీడియా పిడకల వేట!

‘జల్సా’ సినిమాలో ఎలాంటి వాళ్లను ‘గూట్లే’ అంటారో.. దర్శక రచయిత త్రివిక్రమ్ రాసిన సీన్ గుర్తుకు వస్తుంది తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా తీరును చూస్తే. అసలు విషయాన్ని పక్కన పెట్టేసి, పనికిమాలిన వాదన చేస్తూ పండగ చేసుకునే పని చేస్తోంది పసుపుమీడియా!

గతంలో, తను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు… కాయగూరల ధరలు పెరిగినా రోడ్డు ఎక్కిన చంద్రబాబు నాయుడు, ఇప్పుడు తన రాష్ట్రంలో నిరసన అనే పదం వినిపించనీయకూడదని ప్రయత్నిస్తున్నాడు! తను లాలూచీ పడ్డ ప్రత్యేక హోదా ఊసును ఎత్తనీయకుండా అడ్డుపడుతున్నాడు! ఎమర్జెన్సీని తలపింపజేస్తూ.. ప్రతిపక్ష పార్టీ నేతలను, ప్రత్యేకహోదా కాంక్షను వ్యక్తం చేసిన వాళ్లను ఎత్తుకెళ్లి జైళ్లలో పడేశారు! నిరసన తెలిపితే విశాఖ పరువు పోతుందట, ప్రత్యేకహోదాతో ఏమీ రాదట!

తన ఎన్నికల హామీ, ఐదు కాదు.. పది కాదు.. పదిహేనేళ్లు ప్రత్యేక హోదా.. అంటూ ఎన్నికల సమయంలో ఊదరగొట్టి, ఇప్పుడు మాత్రం దాంతో ప్రయోజనం లేదు అంటూ నిస్సిగ్గు మాటలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి! వీళ్లు నంది అంటే నంది.. పంది అంటే పంది.. ఓవరాల్ గా ‘పంది’ మాటలు మాట్లాడుతూ.. సిగ్గులేని తనాన్ని చాటుకుంటున్నారు!

ఇక వీళ్లేం చేసినా వంత పాడే పచ్చ మీడియా నిన్నటి వ్యవహరాలను కవర్ చేసిన తీరు మరింత నిస్సిగ్గుగా ఉంది. బాబుకు జాకీలు వేయడానికి ఎప్పుడో బట్టలిప్పేసి కూర్చున్న పచ్చ మీడియా.. ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డిని ఎయిర్ పోర్టులో బంధించిన తీరును వార్తగా రాసిన తీరు హేయం! జగన్ అనని మాటను పట్టుకుని.. జగన్ కు ఆపాదిస్తూ.. దాన్నే హెడ్డింగ్ గా పెట్టి తమ జర్నలిజం ఎంత నీఛమో చాటుకుంది ఒక ప్రధాన పచ్చపత్రిక! Readmore!

ప్రతిపక్ష నేతను ఎయిర్ పోర్టులో బంధించి, అక్కడ నుంచి బలవంతంగా విమానం ఎక్కించి.. నిరసన తెలిపే అవకాశం కూడా ఇవ్వని ప్రభుత్వ తీరు గురించి రాయాల్సింది పోయి.. జగన్ మాటలను వక్రీకరించే పనిని చేసింది పసుపు మీడియా! ‘మీరు ప్రతిపక్ష నేతను ఆపుతున్నారు.. ముఖ్యమంత్రిని అయితే ఆపుతారా?’ అంటూ జగన్ ప్రశ్నించగా, ‘ముఖ్యమంత్రిని పట్టుకుంటున్నావ్..’ అంటూ జగన్ అన్నట్టుగా మొదటి పేజీల్లోనే వార్తలు రాసింది ఒక పసుపు పత్రిక!

నిండా మునిగినోడికి చలేముంది.. తెగించినోడికి తెడ్డే లింగం.. అన్నట్టుగా ఉంది ఈ పసుపు మీడియా వైఖరి. అంతిమంగా చంద్రబాబు ప్రయోజనాలను, తెలుగుదేశం ప్రయోజనాలను కాపాడటం లక్ష్యం. ఈ లక్ష్యంలో భాగంగా.. వార్తలను రాయడమే పని! ఈ పనిలో భాగంగా.. జగన్ మాటలను వక్రీకరించడం వీళ్లకు పెద్ద కష్టం ఏమీ కాదు కదా! తెగించేశారు.. అసలు రూపాన్ని తెలుగు ప్రజలకు చూపి అసహ్యాన్ని కలిగిస్తున్నారు!

Show comments