శరీరంలో మార్పులు కొన్ని సహజసిద్ధంగా జరిగిపోతుంటాయి. కానీ కొన్ని మాత్రం మన మైండ్ చెప్పినట్టు జరుగుతాయి. అందులో ఒకటి పోర్న్. ఈ తరహా వీడియోలు చూడడం, పుస్తకాలు చదవడం ఎందుకు అలవాటు అవుతుంది.. ఏ వయసులో అలవాటు అవుతుందనే విషయాలపై అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ నెబ్రాస్కా ఓ కీలకమైన సర్వే నిర్వహించింది.
నెబ్రాస్కా యూనివర్సిటీ నిర్వహించిన సర్వే ప్రకారం.. సహజసిద్ధంగా కలిగే శారీరక మార్పులు కంటే చుట్టుపక్కల మనుషుల ప్రభావం, చూసిన ఘటనలు, మీడియానే ఎక్కువగా యువతపై ప్రభావం చూపిస్తున్నాయని తేల్చారు. వీటి కారణంగానే 43.5 శాతం యువత పోర్న్ కు ఆకర్షితులు అవుతున్నారని సర్వే తేల్చింది.
ఇక 33.4 శాతం మంది కావాలనే ఓ వయసు వచ్చిన తర్వాత పోర్న్ చూస్తున్నారని, 17.2శాతం మంది బలవంతంగా పోర్న్ వైపు వస్తున్నారని సర్వేలో తేలింది. ఇక 6 శాతం మాత్రం ఎలాంటి ప్రతిస్పందనలకు లొంగలేదని తేల్చారు. ఓవరాల్ గా 17 నుంచి 54 సంవత్సరాల మధ్య వ్యక్తులపై నిర్వహించిన సర్వేలో ఈ ఫలితాల్ని రాబట్టారు.
నిజానికి ఈ సర్వే చేసింది సెక్స్ లైఫ్ కోసం కాదు. వాషింగ్టన్ లోని అమెరికన్ సైకాలజీ అసోసియేషన్ సమావేశంలో ఈ సర్వే ఫలితాల్ని విశ్లేషించారు. ఈ విశ్లేషణ ఆధారంగా పురుషుల సెక్స్ సైకాలజీని అంచనా వేయడంతో పాటు.. దేశంలో పెరిగిపోతున్న లైంగిక దాడుల్ని అరికట్టడానికి మార్గాలు అన్వేషించవచ్చని నిపుణులు భావిస్తున్నారు.