ఎన్టీఆర్ సినిమాలో సురేష్ వున్నాడు

ఓం త్రీడీ, శ్రీమన్నారాయణ, లయన్, జబర్ధస్త్ ఈ నాలుగు సినిమాల పేర్లు చెప్పగానే జనాలకు తట్టే కామన్ పాయింట్ ఒకటే..ఫ్లాప్ సినిమాలు. అదే కాదు కామన్ పాయింట్. ఇంకోటి వుంది. ఈ సినిమాలు అన్నింటిలోనూ సురేష్ నటించారు. ఒకప్పుడు మాంచి మీడియం రేంజ్ హీరోగా, కామెడీ బాగా పండించగలవాడిగా పేరు తెచ్చుకున్న నటుడు సురేష్. 

కానీ అతగాడి సెకెండ్ ఇన్నింగ్స్ అంటే అదే క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన తరువాత మాత్రం తెలుగులో ఒక్కటంటే ఒక్క హిట్ లేదు. దాదాపు అన్నీ డిజాస్టర్లే. ఇప్పుడు అతగాడు మరో తెలుగు సినిమాలో కూడా చేస్తున్నాడు. కొరటాల శివ-ఎన్టీఆర్ కాంబినేషన్ లోని జనతా గ్యారేజ్ లో సురేష్ ఓ చిన్న పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. 

అంటే ఇప్పుడు ఇటు ఫ్లాపుల మీద వున్న సురేష్ జాతకానికి,  అటు విజయాల జోరు మీద వున్న కొరటాలశివ లక్కుకు ఇది ఆసిడ్ టెస్ట్ అన్నమాట. చూడాలి ఈ సినిమా ఫలితం ఎలా వుంటుందో?

Show comments