మౌలాలీలో బన్నీ గొడవ

ఎందుకు వచ్చిందో, ఎలా వచ్చిందో కానీ హీరో బన్నీకి విలన్లకు గొడవ వచ్చి పడింది. అది కూడా ఎక్కడ మౌలాలీ రైల్వే స్టేషన్ లో. అంతే ఫైటింగ్ నే ఫైటింగ్. అసలే రైల్వే యార్డు అందుకే అక్కడ కావాల్సినన్ని ఆయుధాలు. అవేనండీ, ఇనప రాడ్లు, రెంచీలు, ఇలా రైల్వే యార్డులో వున్న సమస్తం వాడేసారు. చితక్కొట్టేసుకున్నారు. హీరో వున్నాక కోట్టేసుకోవడం వుండదు, కొట్టేయడమే వుంటుంది. ఇక్కడా అదే జరిగింది.

ఇందంతా బన్నీ హీరోగా నటిస్తున్న దువ్వాడ జగన్నాధమ్ సంగతే. ఈ సినిమాను మే లో పేక్షకుల ముందుకు తీసుకురావాలని, చకచకా రెడీ చేస్తున్నారు. సినిమాలో కీలకమైన ఓ ఫైట్ ను ఇప్పుడు చిత్రీకరిస్తున్నారట. ఇందుకు మౌలాలీ స్టేషన్ ప్రాంతాన్ని వేదికగా చేసుకున్నారు. ఇదిలా వుంటే, ఈ రైల్వే యార్డు ఫైట్ కోసం, సహజంగా రైల్వే యార్డుల్లో వుండేలాంటి అనేక పరికరాలను లేటెక్ట్ మెటీయరల్ తో ప్రత్యేకంగా చేయించారట. అందువల్ల చూడడానికి అత్యంత సహజంగా వుండడంతో పాటు ఫైటింగ్ ఎఫెక్ట్ చాలా బాగా వస్తోందట.

Readmore!
Show comments