సాయి ధరమ్ తేజ..మెగా హీరోల్లో థర్డ్ జనరేషన్ హీరోల్లో మాస్ అప్పీల్ పుష్కలంగా వున్న కథానాయకుడు. కానీ తిక్క సినిమాతో వేసిన తప్పటడుగు ఖరీదు ఇంతా అంతాకాదు. ఆ అపఖ్యాతి పోగొట్టుకునే పనిలో వున్నాడు ఇప్పుడు. గోపీచంద్ మలినేని డైరక్షన్ లో విన్నర్ సినిమా చేస్తున్నాడు. రెండు కమర్షియల్ హిట్ ల తరవాత గోపీచంద్ చేస్తున్న సినిమా ఇది.
సినిమా ఎలా వుంటుందో అన్న సంగతి పక్కన పెడితే, సాయి ధరమ్ మీద 24 కోట్ల ఖర్చు పెట్టేసారు. 34 కోట్ల రేంజ్ లో అమ్మకాలు సాగించేసారు. జగపతిబాబు, రకుల్, లాంటి స్టార్ కాస్ట్ వుండడం, గోపీచంద్ మలినేని డైరక్టర్, థమన్, చోటా కే నాయుడు లాంటి టెక్నీషియన్లు వుండడంతో 11 కోట్ల వరకు రెమ్యూనిరేషన్లకే పోయిందట. హార్స్ రేస్ ల బ్యాక్ డ్రాప్ లో సాగే సినిమా కావడంతో పలు రేస్ కోర్స్ ల్లో షూట్ చేసారు. దీంతో మొత్తం ఖర్చు 24కు చేరిపోయింది. అయితే లక్ ఏమిటంటే, బ్యానర్, డైరక్టర్ సక్సెస్ రేంజ్, సాయి ధరమ్ మాస్ అప్పీల్ వర్కవుటై వరల్డ్ వైడ్ అమ్మకాలు 30 కోట్ల మేరకు జరిగాయట.
అంత వరకు బాగానే వుంది. ఇప్పుడు ఈ సినిమా ముఫై కోట్లకు పైగా వసూళ్లు సాగించాలి. అలా సాగించాలంటే, ఫస్ట్ వీకెండ్, వీక్ వసూళ్లు కుమ్మేయాలి. శివరాత్రి టైమ్ కావడం, పెద్దగా కాంపిటీషన్ లేకపోవడం, థియేటర్లలో సరైన మాస్ సినిమా లేకపోవడం వంటివి బయ్యర్లకు భరోసా ఇస్తున్నాయి.