కాబోయే కోడలు సమంతతో కలిసి నాగార్జున ఓ సినిమాలో కన్పించబోతున్నాడట. అది కూడా, 'రాజుగారి గది' సీక్వెల్‌లో. టాలీవుడ్ సర్కిల్స్‌లో గుప్పుమంటున్న గాసిప్ ఇది. ఈ గాసిప్‌పై ఇటు సమంతగానీ, అటు నాగార్జునగానీ ఇంకా స్పందించలేదు. నిజమైతే మాత్రం, అదిరిపోయే కాంబినేషన్ అవుతుంది.
నాగార్జున, సమంత 'మనం' సినిమాలో నటించారు. అందులో సమంత - నాగార్జున మధ్య 'తల్లి కొడుకు' బంధం సింప్లీ సూపర్బ్. 'బిట్టూ..' అంటూ క్యూట్‌గా సమంత ఆ సినిమాలో నాగార్జునని పిలుస్తోంటే, 'అమ్మా..' అంటూ ఆప్యాయంగా నాగార్జున, సమంతని ఉద్దేశించి పిలుస్తోంటే.. ఆ అనుభూతిని వర్ణించడానికి మాటలు చాలవు. అందుకేనేమో, కోడలు కాబోతోన్న సమంతని, తన కూతురిగా అభివర్ణించాడు నాగార్జున సోషల్ మీడియాలో.
మళ్ళీ నాగార్జునతో సమంత నటించడమంటే, 'మనం' సినిమాలో వున్న ఫీల్‌కి పదింతల ఫీల్ వచ్చేలా వుండాలి. 'రాజుగారిగది' సినిమాతో దర్శకుడిగా సత్తా చాటిన ఓంకార్, ఆ సినిమా సీక్వెల్‌లో నాగార్జునతో నటింపజేయడమే చాలా గొప్ప విషయం. ఇక, ఈ సినిమా కోసం సమంతని కూడా తీసుకోవడమంటే, నాగార్జునని ఏ స్థాయిలో ఒప్పించి వుండాలి.? ఏమో మరి, ఈ వార్త నిజమైతే.. ఈ కాంబినేషన్ కోసం అభిమానుల ఎదురు చూపులు ఎవరూ ఊహించని రేంజ్‌లో వుంటాయన్నది నిర్వివాదాంశం.