సాహోరే బాహుబలి : ప్రభాస్ హిందీ పాఠాలు

ప్రభాస్ కు హిందీ వచ్చు. కొద్దికొద్దిగా మాట్లాడతాడు. కానీ డబ్బింగ్ చెప్పడానికి ఆ హిందీ సరిపోదు. అవును.. ప్రభాస్ ఇప్పుడు హిందీలో డబ్బింగ్ చెప్పడానికి రెడీ అవుతున్నాడట. తన అప్ కమింగ్ మూవీ సాహోకు హిందీలో సొంతంగా డబ్బింగ్ చెప్పాలని ప్రభాస్ నిర్ణయించుకున్నాడు. అందుకే హిందీ క్లాసులు తీసుకుంటున్నాడట.

ప్రభాస్ నటించిన బాహుబలి-1, బాహుబలి-2 సినిమాలు హిందీలో సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. బాహుబలి-2 అయితే బాలీవుడ్ నంబర్ వన్ మూవీగా అవతరించింది. కానీ ఆ రెండు సినిమాలకు ప్రభాస్ డబ్బింగ్ చెప్పుకోలేదు. ఓ మంచి బేస్ వాయిస్ చూసి డబ్బింగ్ చెప్పించారు. కానీ సాహోతో మాత్రం హిందీ ప్రేక్షకులకు తన సొంత గొంతు వినిపించాలని డిసైడ్ అయ్యాడట ప్రభాస్.

గతంలో హీరో ధనుష్ ఇలాంటి ప్రయత్నమే చేశాడు. రాన్ ఝానా సినిమా కోసం హిందీ నేర్చుకొని మరీ సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నాడు. ఇప్పుడు ప్రభాస్ కూడా అదే రూటు ఫాలో అవుతున్నాడు. ఉచ్ఛారణ నుంచి యాస వరకు ప్రతి ఎలిమెంట్ లో పట్టు కోసం ప్రయత్నిస్తున్నాడట.

మరోవైపు సైలెంట్ గా సాహో షూటింగ్ ప్రారంభమైంది. హైదరాబాద్ సెంట్రల్ లైబ్రరీలో ఈ సినిమాకు సంబంధించి కొన్ని షాట్స్ తీసుకున్నారు. అయితే ఈ షూట్ లో ప్రభాస్ లేడు. ప్రభాస్ తో రామోజీ ఫిలింసిటీలో త్వరలోనే భారీ షెడ్యూల్ ప్రారంభమౌతుంది. తర్వాత యూనిట్ దుబాయ్ వెళ్తుంది. మేజర్ షూటింగ్ అంతా అక్కడే.

Show comments