మొత్తానికి ఇన్నాళ్లకు నారా రోహిత్ తన ఫిజిక్ మీద సీరియస్ గా దృష్టి పెట్టాడు. అయితే ఎక్స్ ర్ సైజ్ లు, బేరియాట్రిక్ సర్జరీలను నమ్ముకోకుండా, కేవలం నాచురోపతీని పాటిస్తున్నాడట. గతంలో అంటే ఒకటి రెండు ఏళ్ల క్రితం నారా రోహిత్ బేరియాట్రిక్ ను ట్రయ్ చేసినట్లు తెలుస్తోంది.
టెస్ట్ బేసిస్ లో కొన్ని కిలోలు తీయిస్తే, అది వికటించి మరింత లావుకు దారి తీసిందని వినికిడి. దాంతో తన బాడీకీ ఇలాంటివి సూట్ కావని, మాంచి నాచురోపతీ స్పెషలిస్ట్ ద్వారా సన్నబడేందుకు ప్రయత్నిస్తున్నాడట. అది కొంతవరకు ఫలితం ఇచ్చి, లుక్ లో ఛేంజ్ తెచ్చిందట.
పైగా అదే సమయంలో నాచురోపతికి అవసరమైన స్ట్రిక్ట్ డయిట్ రూల్స్ పాటిస్తున్నాడట. ఈ క్రమంలో లిక్కర్ కూడా టచ్ చేయడం లేదని సన్నిహితుల భోగట్టా. ఇప్పటికే దాదాపు ఫినిష్ అయిన సినిమాలను ఎలాగోలా విడుదల చేసేసిన తరువాతే కొత్తలుక్ తో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఒక థ్రిల్లర్ ను ఆ కొత్త లుక్ లాంచింగ్ కు ఎంచుకున్నట్లు వినికిడి.