ప్రేమమ్ కు యు/ఎ

ప్రేమమ్ సినిమా సెన్సార్ పూర్తయింది. మళయాల సినిమా ప్రేమమ్ ఆధారంగా నాగ్ చైతన్య శృతి హాసన్ లతో చందు మొండేటి డైరక్షన్ లో సితార ఎంటర్ టైన్ మెంట్స పతాకంపై ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. అక్టోబర్ 7 ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. యు/ఎ సర్టిఫికెట్ లభించింది. 

కాస్త డ్రింకింగ్, స్మొకింగ్ లు సీన్లు వుండడం వల్ల యు/ఎ పై సర్టిఫికెట్ వచ్చింది. లేదంటే క్లీన్ యు సర్టిఫికెట్ వచ్చేదని యూనిట్ వర్గాల బోగట్టా. ఇటీవల విడుదల చేసిన ట్రయిలర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. పాటలు ఇప్పటికే జనాలకు పట్టేసాయి. మాతృక ఫ్లావర్ చెడిపోకుండా, తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా కాస్త భారీగానే ఈ సినిమాను రూపొందించారు. 

నాగ్ చైతన్య గెడ్డం లుక్ కు జనాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నామని సితార ఎంటర్ టైన్ మెంట్స్ సూర్యదేవర వంశీ అన్నారు. యూత్ ఫుల్ గానే కాకుండా, కలర్ ఫుల్ గా వుంటుందని, శృతి కాకుండా మిగిలిన ఇద్దరు హీరోయిన్లు కూడా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటారని ఆయన అన్నారు. 

Show comments