ఈ ఏడాది సినిమా రిలీజ్‌కి మంచి డేట్స్‌గా పేర్కొనబడుతోన్న వాటిలో ఇండిపెండెన్స్ డే వీకెండ్ ఒకటి. వీకెండ్ అనంతరం సోమవారం కృష్ణాష్టమి, మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో వరుసగా రెండు పబ్లిక్ హాలిడేస్ వస్తాయి. లాంగ్ వీకెండ్‌ని క్యాష్ చేసుకునే వీలుండడంతో ఆ శుక్రవారం తమ చిత్రాలని విడుదల చేసుకోవడానికి చాలా మంది ప్లాన్ చేసుకున్నారు.
జై లవకుశ, స్పైడర్, పవన్‌కళ్యాణ్ 25 అన్నీ అప్పుడు రావాల్సినవే కానీ ఏవో కారణాల వల్ల వాయిదా పడ్డాయి. దీంతో మిగిలిన సినిమాలకి ఈ డేట్‌ని క్యాష్ చేసుకునే వీలు చిక్కింది.
ముందుగా చాలా మంది దీనిపై కన్నేసినప్పటికీ ఓవర్ రష్ వల్ల అందరికీ నష్టమని ఎవరికి వారు వేరే డేట్ చూసుకున్నారు. అయితే ఆగస్టు 11కి తమ చిత్రాన్ని ఖచ్చితంగా విడుదల చేయాలని నితిన్ 'లై' చిత్ర నిర్మాతలు, బోయపాటి శ్రీను 'జయ జానకి నాయక' మేకర్స్ డిసైడ్ అయ్యారు.
'లై' ఆసక్తికరమైన ప్రమోషన్స్‌తో కొత్తగా కనిపిస్తోంది. హను రాఘవపూడి టాలెంటెడ్ అనేది ఇప్పటికే రుజువైంది. ఇక బోయపాటి శ్రీనుకి మాస్ పల్స్ ఎంత బాగా తెలుసనేది ఎన్నోసార్లు ప్రూవ్ అయింది.
ఇందులో హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్నాడు. ఈ ఇంట్రెస్టింగ్ క్లాష్‌లో ఎవరిది పైచేయి అవుతుందనేది ఆసక్తికరం. రెండూ రెండు ధృవాలకి చెందిన సినిమాలు కనుక ఈ క్లాష్ వల్ల ఇరువురికీ నష్టం జరగదనే బయ్యర్లు ఆశిస్తున్నారు.