కత్తిపట్టిన కాటమరాయుడు భామ

శృతిహాసన్ ప్రస్తుతం లండన్ లో ఉంది. ఏదో విహార యాత్ర కోసం లండన్ వెళ్లలేదామె. సీరియస్ గా ట్రయినింగ్ తీసుకునేందుకు వెళ్లింది. అవును.. పైన మీరు చూస్తున్న ఫొటో లండన్ లో తీసినదే. అక్కడ హాలీవుడ్ స్టంట్ మాస్టర్ పర్యవేక్షణలో కత్తియుద్ధం నేర్చుకుంటోంది శృతిహాసన్. 

సుందర్.సి దర్శకత్వంలో సంఘమిత్ర అనే సినిమా చేసేందుకు ఒప్పుకుంది శృతిహాసన్. ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషించనుంది. భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమా కోసమే శృతి ఇలా కత్తిపట్టింది. ఓవైపు కత్తియుద్ధం, మరోవైపు గుర్రపుస్వారీ నేర్చుకుంటూ లండన్ లో బిజీబిజీగా ఉంది. బాహుబలి, 2.0 సినిమాల కంటే భారీ బడ్జెట్ తో రాబోతోందట సంఘమిత్ర మూవీ. శ్రీ తేనాండల్ ఫిలిమ్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది.

ఇప్పటికే బాహుబలి సినిమాలో తమన్న కత్తిపట్టింది. బాహుబలి-2లో అనుష్క కూడా కత్తి పట్టి యుద్ధం చేసిన సన్నివేశాలున్నాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి శృతిహాసన్ కూడా చేరిపోయింది. తెలుగు-తమిళ-హిందీ భాషల్లో రాబోతున్న సంఘమిత్ర సినిమాలో.. యుద్ధనారిగా కనిపించనుంది శృతిహాసన్.

Readmore!
Show comments

Related Stories :