కన్నడ కుర్రాడితో కొరటాల?

కొరటాల శివ.. ఊ అంటే చాలు సినిమా చేయాలని తెలుగు హీరోలంతా చూస్తున్నారు. కానీ అతగాడు ఓ కన్నడ కుర్రాడిని తెలుగుకు పరిచయం చేసే ఆలోచనలో వున్నాడని వినికిడి. మాజీ ఉప ప్రధాని దేవగౌడ మనుమడు నిఖిల్ కుమార్ గౌడను తెలుగులో పరిచయం చేస్తూ ఓ సినిమా తీయాలన్నది అతని తండ్రి కుమారస్వామి గౌడ ఆలోచన. 

గతంలో ఈ సినిమాను పూరి జగన్నాధ్ రూపొందిస్తారని వార్తలు వినిపించాయి. కానీ అది మెటీరియలైజ్ కాలేదు. ఇప్పుడు ఆ ప్రాజెక్టును కొరటాల శివకు ఆఫర్ చేసారని వినికిడి. కాస్త భారీగానే రెమ్యూనిరేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. దానయ్య నిర్మాతగా చేసే సినిమా పూర్తయిన తరువాత కొరటాల శివ ఈ ప్రాజెక్టు టేకప్ చేయవచ్చని తెలుస్తోంది. తెరవెనుక పెట్టుబడి ఎవరిదైనా, తెర ముందు మాత్రం ఆంధ్ర ఎన్నారైల పేరే వుంటుందని తెలుస్తోంది.

Show comments