బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'రోబో' సీక్వెల్ '2.0'లో విలన్‌గా నటిస్తున్న విషయం విదితమే. ఈ ఏడాది అక్టోబర్‌లో '2.0' విడుదలయ్యే అవకాశాలున్నాయి. 'రజనీకాంత్ సినిమాలో నటించే ఛాన్స్ వస్తే ఎవరైనా ఒప్పుకుంటారా.? నేనూ అంతే.. అందుకే, సినిమా గురించి చెప్పగానే ఓకే అనేశాను..' అంటున్న అక్షయ్‌కుమార్, 2017లో తాను నటిస్తున్న బిగ్గెస్ట్ సినిమా '2.0' అని చెబుతున్నాడు.
నిజానికి అక్షయ్‌కుమార్ హీరోగా నటించిన 'జాలీ ఎల్‌ఎల్‌బి' సినిమా ఫిబ్రవరిలోనే విడుదలవుతుంది. ఈ సినిమా ప్రమోషన్‌లో అప్పుడే బిజీ అయిపోయాడు అక్షయ్‌కుమార్. తాను హీరోగా నటిస్తున్న సినిమా కన్నా, విలన్‌గా నటించిన సినిమానే 'బిగ్గెస్ట్..' అని చెప్పడమంటే, ఆషామాషీ వ్యవహారం కాదు.. పైగా అభిమానులూ హర్ట్ అవుతారు. అక్షయ్‌కుమార్ మాత్రం, ఇప్పటిదాకా చేసిన సినిమాలతో పోల్చితే తనకు '2.0' సినిమా వెరీ వెరీ స్పెషల్ అని తేల్చేశాడు.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శంకర్ '2.0' సినిమాని తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో హీరోతో సమానంగా.. ఆ మాటకొస్తే, హీరోకన్నా ఎక్కువ ఇంపార్టెన్స్‌తో అక్షయ్‌కుమార్ పాత్రను దర్శకుడు శంకర్ తీర్చిదిద్దాడనే ప్రచారం జరుగుతోంది. '2.0' గురించి అక్షయ్‌కుమార్ చేస్తున్న వ్యాఖ్యలు, సినిమాపై అతను చూపిస్తున్న స్పెషల్ ఇంట్రెస్ట్.. ఇవన్నీ చూస్తోంటే, శంకర్ - రజనీకాంత్‌తో సమానంగానో, అంతకన్నా ఎక్కువగారో అక్షయ్‌కుమార్‌కి '2.0'లో ఇంపార్టెన్స్ ఇచ్చి వుండొచ్చన్న అనుమానాలు బలపడ్డం సహజమే కదా.!