మెగా హీరోల మీద వెటకారం చేస్తూ ట్వీట్ లు చేయడంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కంటే ఘనులు లేరు. ఒకటీ రెండూ కాదు, ఎడాపెడా ట్వీట్ ల మీద ట్వీట్ లు చేస్తూనే వుంటాడు. మెగాభిమానులు తిట్లు లంకించుకుంటారు. ఇది కామన్. కానీ ఇవ్వాళ వర్మ చేసిన ట్వీట్ ఢిఫరెంట్ గా వుంది.
పవన్ కళ్యాణ్ నిద్రపోతున్న అగ్నిపర్వతం లాంటి వాడు. అప్పుడ్పపుడు గుడ గుడ హడావుడి చేస్తుంటుంది. కానీ టైమ వచ్చినపుడు పేలుతుంది అనే అర్థం వచ్చేలా అచ్చమైన తెలుగులో ట్వీట్ చేసాడు.
వర్మ ఇలా ఎందుకు చేసాడు అని అనుకోగానే..ఇంకేమీంది, వంగవీటికి పాజిటివ్ పబ్లిసిటీ కోసమే ఇదంతా అని సమాధానాలు వినిపిస్తున్నాయి. క్లిష్టమైన ఇంగ్లీష్ లో ట్వీట్ చేసే వర్మ, మెగాభిమానులకు స్పష్టంగా అర్థమయ్యే సింపుల్ తెలుగులో ట్వీట్ చేయడం, అది కూడా ఫుల్ పాజిటివ్ గా ట్వీట్ చేయడం అంటే రేపు విడుదలవుతున్న వంగవీటి సినిమా పట్ల మెగాభిమానులు కూడా పాజిటివ్ గా రెస్పాండ్ కావాలనే ఏమో?
పైగా మెగాభిమానుల్లో చాలా మంది కాపు కులానికి చెందిన వారు వుండడం అన్నది కామన్. వంగవీటి సినిమాకు కాపు కులస్థుల అండ కావాల్సి వుంది. అందుకే వర్మ ఇలా ముందు జాగ్రత్త పడినట్లు కనిపిస్తోంది. అయినా ఒక్క వంగవీటి సినిమా వర్మను ఎంత మార్చేసింది. పబ్లిసిటీ కోసం తహతహలాడుతున్నారు. ఇంటర్వూలు ఇస్తున్నారు. వాటిని ట్వీట్ చేస్తున్నారు. అబ్బో..ఒకటేమిటి? చాలా వుంది వ్యవహారం.