ఎక్కడికి వెళ్తున్నారు పూరీ.

స్టార్ హీరో అయినా, దర్శకుడు అయినా వారి లెవెల్ కు తగ్గ వ్యాపారాలు ప్రారంభిస్తే అందంగా వుంది. సినిమా వాళ్లు చాలా మంది హోటల్ వ్యాపారంలోకి రావడం కద్దు..అదయినా అలవాటైన వ్యాపారం అని సరిపెట్టుకోవచ్చు. కానీ దర్శకుడు పూరి జగన్నాథ్ తీరు వేరుగా వుంది. ఆయన లెవెల్ వదిలేసి, ఏవేవో చేద్దాం అనుకుంటున్నారు. ఆ మధ్య కొత్త నటుల కాస్టింగ్ వ్యవహారాలు చూసేందుకు పూరి కనెక్ట్ అనే కంపెనీ పెట్టారు. 

అసలు పూరి లాంట దర్శకుడు ఆ వ్యాపారంలోకి దిగడమే కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి. నటుల డేట్ లు, చాన్స్ లు చూసి, కమిషన్ తీసుకునే వ్యాపారం కదా అది..కరెక్ట్ గా చెప్పాలంటే. ఇప్పుడు కొత్తగా ఏడ్ ఏజెన్సీ కూడా పెడతా అంటున్నారు. నేషనల్ లెవెల్ లో ఓ భారీ ఏడ్ ఏజెన్సీ పెడితే మంచిదే. కానీ పూరికి వున్న సర్కిల్, ఆయన వ్యవహారాలు చూస్తుంటే సినిమా ఏడ్ ఏజెన్సీనే పెడతారనుకోవాలి. 

ఏడ్ ఏజెన్సీ అన్నది పూరి లెవెల్ దర్శకులు చేసే వ్యాపారం కాదు. ఇప్పటికే ఇండస్ట్రీలో ఈ వ్యాపారాలను చాలా మంది చేస్తున్నారు. ఇక్కడ అంత చాన్స్ ఏమీ లేదు. అంత భయంకరమైన లాభాలు లేవు. అలాంటి దాంట్లో పూరి ప్రవేశించడం ఏమిటో? పూరి లాంటి సృజన వున్నవారు ట్రయినింగ్ ఇన్ స్టిట్యూట్ లో, లేదా సుకుమార్ మాదిరిగా చిన్న సినిమాలు తీస్తూ, కొత్తవాళ్లకి అవకాశాలు ఇవ్వడమో చేయాలి కానీ, ఇలాంటి చిన్న చిన్న వ్యవహారాలాల్లో అడుగుపెట్టడం కాదేమో? 

ఇలాంటివి అన్నీ చూస్తుంటే మెట్లు ఎక్కడానికి బదులు పూరి, దిగుతున్నట్లుగా అనిపిస్తోంది. మరోపక్క తన దగ్గర మరో పదేళ్లకు సరిపడా కథలు వున్నాయంటున్నారు. కథలు వున్నాయి సరే, హీరోలు ఎక్కడ? మహేష్ ..నో, చరణ్ ..నో..నితిన్ నో..మెగాస్టార్ నో..ఇలా నో..నో..ల జాబితా పెరుగుతోందని పూరి గమనించడం లేదా? ఏమో? Readmore!

Show comments