సినిమాల్లో చెయ్యలేక.. ఇక్కడ చేసేశాడు

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ పెను సంచలనానికి తెరలేపాడు. వెబ్‌ సిరీస్‌ 'గన్స్‌ అండ్‌ థైస్‌' సీజన్‌-1 ట్రైలర్‌ విడుదల చేశాడు. 'సినిమాల్లో చెయ్యలేనిది, ఈ వెబ్‌ సిరీస్‌లో చేసి చూపిస్తున్నాను..' అని వర్మ ట్రైలర్‌లో పేర్కొన్నాడు. ఇంతకీ, వర్మ సినిమాల్లో చెయ్యలేనిది, వెబ్‌ సిరీస్‌లో చెయ్యగలిగినదీ ఏంటో తెలుసా.? 

సినిమాలో లేడీ క్యారెక్టర్‌ని నగ్నంగా చూపించి వర్మ అందర్నీ విస్మయానికి గురిచేశాడు. ఈ 'బాగోతానికి' ముందుగానే వర్మ సోషల్‌ మీడియాలో పెద్ద షాక్‌ ఇచ్చాడు. తన పాలోవర్స్‌కి షాకింగ్‌ న్యూస్‌ చెప్పబోతున్నానని ఈ రోజు మధ్యాహ్నమే హింట్‌ ఇచ్చిన వర్మ, సాయంత్రానికి 'గన్స్‌ అండ్‌ థైస్‌' సీజన్‌-1 ట్రైలర్‌ని విడుదల చేశాడు. 

ఇందులో ఓ లేడీ క్యారెక్టర్‌ నగ్నంగా కన్పించింది. నగ్నంగా అంటే అవీ ఇవీ అడ్డం పెట్టే టైపు నగ్నత్వం కాదు. ఇది పూర్తి నగ్నత్వం. వెబ్‌ సిరీస్‌లో అయితే ఏం చేసినా చెల్లిపోతుందని వర్మ అనుకున్నాడేమో.! మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఈ వెబ్‌ సిరీస్‌ని వర్మ తెరకెక్కిస్తున్నాడు. శృంగారం సంగతి పక్కన పెడితే, మాఫియా బ్యాక్‌డ్రాప్‌ కదా.. మోతాదుకి మించిన రక్తపాతం కూడా తప్పదు.

Show comments