హీరో నానికి ఓవర్ సీస్ లో మంచి మార్కెట్ నే వుంది. అందులో సందేహం లేదు. భలే భలే మగాడివోయ్, జెంటిల్ మన్ మంచి కలెక్షన్లే నమోదు చేసాయి. అయితే ఈ సారి నాని నేరుగా యుఎస్ కు వెళ్లిపోయారు. ధృవకు రామ్ చరణ్ వెళ్లినట్లుగా అన్నమాట.
నాని యుఎస్ ప్రీమియర్లకు హాజరయ్యారు. దీని ఫలితం బాగానే కనిపించింది. పస్ట్ డే ప్రీమియర్లకు 1,61,000 డాలర్లు వసూలయ్యాయి. ఇది కాస్త గట్టిగా చెప్పుకోదగ్గ సంఖ్యే. గతంలో నాని సినిమాల ప్రీమియర్లు వసూలు చేసిన దానికి డబుల్ కన్నా ఎక్కువే. యుఎస్ కుర్రకారులో నాని అంటే వున్న క్రేజ్ ఈ వసూళ్లకు దారి తీసినట్లు కనిపిస్తోంది.
నేను లోకల్ సినిమా సబ్జెక్ట్, టేకింగ్ పరంగా యుఎస్ ఆడియన్స్ కు ఎంతవరకు నచ్చుతుందో చూడాలి. అయితే నాని ఇప్పుడప్పుడే ఇండియాకు తిరిగి వచ్చేయడం లేదు. సినిమా నడిచే ఒకటి రెండు వారాలకు పైగా ఆయన అక్కడే వుంటారు. అందువల్ల నాని వచ్చే షోలకు గ్యారంటీగా టికెట్ లు బాగానే తెగుతాయి.