కేసుల భయం జగన్ కేనా?

అవును. దేశంలో ఎక్కడ ఏ జడ్జిమెంట్ వచ్చిన ఇంట్లో మారుమూల గదిలో తలుపులు మూసుకుని, గజగజ వణుకుతూ భయపడాల్సింది వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ నే. ఆ కేసుల్ని, వాటి వైనాన్ని, జగన్ కేసును, ఆ వైనాన్ని బేరీజు వేసుకుని ఎంత శిక్ష పడుతుందో లెక్క కట్టి చెప్పడానికి టీడీపీకి చెందిన బోండాలాంటి సిద్ధాంతులు రెడీగా వుంటారు. వీరంతా గురివింద టైపు జనాలే. తమ పార్టీలో జనాలకు కేసులే తెలియనట్లు. తమ నాయకుడిపై కేసులే లేనట్లు, వీరి జోస్యాలు పరిఢవిల్లుతుంటాయి. నడుస్తున్న కేసులే కానీ, కోర్టులకు, కేసులకు అడ్డం పడిపోయి, తమ తమ చాకచక్యాలు ఉపయోగించి, తమ తమ జనాలను వాడుకుని, తమ తమ కేసులను ముందుకు సాగకుండా ఎంత చేయాలో అంతా చేసిన వైనమే గుర్తుకు రాదు వీరికి. 
రాష్ట్ర రాజకీయాలను, చంద్రబాబు వ్యవహారాలను పరిశీలించే సాదా సీదా జనాల నుంచి పోలిటికల్ పరిశీలకుల వరకు తెలుసు, కోర్టుల దగ్గర చంద్రబాబు వ్యవహారం ఎలా వుంటుంది అన్నది అందరికీ తెలిసిందే. కొన్ని కొన్ని పద్దతులకు లోబడి బహిరంగంగా బోండా మాదిరిగా అరవలేకపోయినా, చంద్రబాబుకు కోర్డుల దగ్గర వున్న ధీమా ఏమిటో తెలిసిన సంగతే.
ఇవన్నీ మరిచిపోయి, శశికళ జడ్జిమెంట్ తో జగన్ కు వణకు పుడుతోందని నోరు పారేసుకోవడం అంటే ఏమనుకోవాలి? నిజంగా జగన్ తప్పు చేసి వుండి, ఆరోజు వస్తే ఎవరూ ఏమీ చేయలేరు. కానీ ఆదికి ముందే ప్రజల ను మాస్ హిప్నటైజ్ చేసే పని చేపట్టే తెలుగుదేశం అను 'కుల' పత్రికలకు సరిపడా ఫీడింగ్ ను అందించే ప్రయత్నం చేయడం మాత్రం సరికాదు కదా?

 

Show comments