శృతిహాసన్ మరోసారి మీడియాపై ఫైర్ అయింది. "నా శరీరం నా ఇష్టం" అంటూ బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చేసింది. హిందీలో బెహన్ హోగీ తేరీ అనే సినిమా చేసింది శృతిహాసన్. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా హీరో రాజ్ కుమార్ రావ్ తో పాటు మీడియా ముందుకొచ్చింది. ఈ సందర్భంగానే ఈ హాట్ కామెంట్స్ చేసింది శృతిహాసన్.
"హీరోయిన్లంతా సన్నబడుతుంటే మీరేంటి లావెక్కుతున్నారు. మీ పెదాలకు ఈ మధ్య ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారంట నిజమేనా..?" బాలీవుడ్ మీడియా నుంచి శృతిహాసన్ కు ఎదురైన ప్రశ్నలివి. ఈ రెండు ప్రశ్నలతో ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. నా శరీరం నా ఇష్టం, మీ జడ్జిమెంట్స్ తో నాకు పనిలేదని అనేసింది.
కొన్ని సందర్భాల్లో పాత్రకు తగ్గట్టు కాస్త బొద్దుగా కనిపించాలని, మరికొన్ని సందర్భాల్లో మన ప్రమేయం లేకుండానే శరీరం లావెక్కుతుందని.. అలాంటి వాటిపై ప్రశ్నలు వేయడం మానుకోవాలని సూచించింది. అయినా నా శరీరం గురించి అడగడానికి మీరెవరు అంటూ ఎదురు ప్రశ్నించింది.
శృతిహాసన్ చెప్పిన సమాధానం బాగానే ఉంది కానీ హీరోయిన్ గా కొనసాగుతున్న టైమ్ లో బాడీ వెయిట్ ను కంట్రోల్ చేసుకోకపోతే ఎలా? మరోవైపు పెదాలకు ప్లాస్టిక్ సర్జరీ మేటర్ ను కూడా స్కిప్ చేసింది ఈ భామ.