హత్య వెనుక హత్య.. ఏ 'ఆత్మ' చేస్తోంది.?

తమిళనాడులో హత్యలు జరుగుతున్నాయి. ఒకదాని తర్వాత ఇంకో హత్య జరుగుతోంది. ఈ హత్యలన్నీ జయలలితతో ఏదో ఒక రకంగా సంబంధాలున్నవారి హత్యలే కావడం గమనార్హం. జయలలిత మరణమే ఓ పెద్ద మిస్టరీ. ఆమె ఎలా చనిపోయింది.? అన్నదానిపై సవాలక్ష వాదనలున్నాయి. ఆమెను చంపేశారన్న వాదన ఇటీవలి కాలంలో చాలా చాలా గట్టిగా విన్పిస్తోంది. ఆ వాదనలకు బలం చేకూరేలా, వరుస హత్యలు జరుగుతుండడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. 

జయలలితకు చెందిన ఎస్టేట్‌ వాచ్‌మెన్‌ హత్యకు గురయ్యాడు.. ఆ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తీ హత్యకు గురయ్యాడు. ఇంతకీ, సీరియల్‌ కిల్లర్‌ ఎవరు.? జయలలిత 'ఆత్మ' ఈ హత్యల్ని చేయిస్తోందా.? అని తమిళ జనం చర్చించుకుంటున్నారు. అన్నాడీఎంకే పార్టీలోనూ ఇప్పుడు ఇదే ప్రశ్న చుట్టూ తీవ్రమైన చర్చ జరుగుతోంది. సాధారణంగా, రాజకీయ నాయకులకు సంబంధించి డ్రైవర్‌ అయినా, వాచ్‌మెన్‌ అయినా.. నమ్మకస్తులే ఎక్కువగా వుంటారు. 

'నమ్మకస్తులు' అన్న మాటకి అర్థాలు చాలా చాలా వుంటాయి. అలాంటివారిలో బినామీలు కూడా వుంటారన్నది జగమెరిగిన సత్యం. చనిపోయిన వాచ్‌మెన్‌ అయినా, డ్రైవర్‌ అయినా బినామీ ఎందుకు కాకూడదు.? బినామీ కాకపోయినా, జయలలితకు సంబంధించి అతి ముఖ్యమైన వివరాలు, వారికి తెలిసే వుంటాయి. అంటే, ఆస్తులకు సంబంధించి కావొచ్చు, ఇతరత్రా విషయాలు కావొచ్చు. అవేవీ బయటకు రాకూడదనే ఈ హత్యలు జరుగుతున్నాయి. 

చిత్రంగా అన్నాడీఎంకే పార్టీలోని శశికళవర్గం, పన్నీర్‌ సెల్వం వర్గం ఒక్కటవుతున్న సమయంలో ఈ వరుస హత్యలు జరుగుతున్నాయంటే, అక్కడ మేటర్‌ ఏదో తేడాగా అన్పిస్తోంది కదూ.! Readmore!

Show comments

Related Stories :