చంద్రన్న ప్రవచనాల, పంచాయితీల ఫలితమిదేనా?

ఒకవైపు చంద్రబాబు హితబోధలు చేయడం, సర్దుకుపోవాలని చెప్పడం.. అమరావతి వేదికగా బాబు వారికి చాలా సర్ధి చెప్పారు. సర్దుకుని పొమ్మన్నారు. మీడియా ముఖంగా కూడా చాలా సార్లు హెచ్చరికలు జారీ చేశారు. మరి ఆయన ఏం చేసినా.. ఏం చెప్పినా.. కరణం, గొట్టిపాటి వర్గాల మధ్య రాజీ కుదిరేలా లేదు. వారి మధ్య రాజీ కుదర్చడానికి ప్రత్యేకంగా సమన్వయం అంటూ భేటీని ఏర్పాటు చేస్తే.. ఆ సమావేశంలో తమ్ముళ్లు తీరిగ్గా తన్నుకున్నారు. ఈ సారి స్పెషల్ అట్రాక్షన్ ఏమిటంటే.. అటు గొట్టిపాటి, ఇటు కరణం బలరాంలు ముష్టియుద్ధానికి దిగడం. వీరిద్దరూ తలపడ్డారు, తోసుకున్నారు, చొక్కాలు చించుకున్నారు. మరి నేతలే ఈ విధంగా తలపడే సరికి.. అనుచరులకు కొత్త ఉత్సాహం వచ్చింది. అటు ఇటు రెచ్చిపోయారు. తోపులాట జరిగింది. కరణం బలరాం అనుచరుల హత్య నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య రాజీ చేయడానికి ఈ సమావేశంజరిగింది.

ఈ కార్యక్రమానికి మంత్రులిద్దరు సమన్వయకర్తలుగా హాజరయ్యారు. అయితే వారందరినీ పక్కకు తోసేసి.. తమ్ముళ్లు తన్నుకున్నారు. ఇరు వర్గాలనూ పోలీసులు వేరు చేసి తీసుకెళ్లారు. మొత్తానికి వైకాపా నుంచి ఎమ్మెల్యే ఫిరాయింపుతో తెలుగుదేశం పార్టీలో ఎలాంటి పరిస్థితి ఏర్పడిందో స్పష్టం అవుతోంది. ఇప్పటి వరకూ వీరిద్దరి మధ్య గొడవను పరిష్కరించడానికి చంద్రబాబు ఎంత యత్నించారో ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. అయినా పరిస్థితిలో అణువంతైనా మార్పు కనిపించడం లేదు. మరి ఎవరో ఒకరు పార్టీని వీడి వెళ్లే వరకూ కూడా ప్రశాంత వాతావరణం ఏర్పడేలా లేదు.

Readmore!
Show comments

Related Stories :