పూరి టార్గెట్ మెగా సినిమానా?

సినిమాను చకచకా తీసేయడం, విడుదల డేట్ ముందే ప్రకటించేయడం దర్శకుడు పూరిజగన్నాధ్ కు అలవాటే. అయితే బాలకృష్ణతో సినిమాను పెర్ ఫెక్ట్ గా ప్లాన్ చేయడం, దసరాకు విడుదల డేట్ ప్రకటించడం మాత్రం మెగాభిమానులకు అంతగా రుచించడం లేదు. రామ్ చరణ్-సుకుమార్ కాంబినేషన్ సినిమాను చకచకా ఫినిష్ చేసి ఎలాగైనా దసరా బరిలోకి దింపాలనే ఆలోచనలో వున్నారు. 

ఇలాంటి టైమ్ లో పూరి పోటీకి దిగడం, అది కూడా నందమూరి బాలయ్య సినిమాను మెగా సినిమాకు పోటీగా దించే ప్రయత్నం చేస్తుండడం వారికి కాస్త చికాకు కలిగిస్తోంది. మొన్నటికి మొన్న సంక్రాంతి బరిలో బాలయ్య, మెగాస్టార్ సినిమాలు పోటీ పడ్డాయి. అయితే ఎవరికీ నష్టం లేకపోయింది. ఇప్పుడు సుకుమార్, పూరి సినిమాలు బరిలో నిల్చుంటే ఎలా వుంటుందో? 

ఆటోజానీ క్యాన్సిల్ అయిన దగ్గర నుంచి పూరిజగన్నాధ్ మెగా ఫ్యామిలీకి కాస్త దూరంగానే వుంటూ వస్తున్నాడు. దానికి తోడు పూరి గురువు ట్విట్టర్ లో పదే పదే మెగాస్టార్ ను, రామ్ చరణ్ ను టార్గెట్ చేస్తూనే వున్నారు. కానీ ఖైదీ 150 హిట్ తరువాత ఆ జోరు కాస్త తగ్గింది. కానీ ఇప్పుడు మళ్లీ పోటీ తప్పేలాలేదు. పైగా బాలయ్య 101 ప్రారంభం కాగానే, ఇప్పటి దాకా తెరవెనుక వర్క్ చేసుకుంటూ వున్న మెగాస్టార్, తన 151 టైటిల్ ను రిజిస్టర్ చేయించేసారు. అంటే ఇక ఆ పనీ మొదలవుతుంది. దాంతో పోటీలేదు కానీ, ఇప్పుడు రామ్ చరణ్ సినిమా మీద పోటీకి దిగడమే మెగాభిమానులకు మింగుడు పడడంలేదు.

Show comments