నో కామెంట్: పుష్కరాల ఏర్పాట్లపై బాబుకు కృతజ్ఞతలు

కృష్ణా పుష్కరాలు అంటే ఏపీ జనాలకు గత ఏడాది జరిగిన గోదావరి పుష్కరాలే గుర్తుకు వస్తున్నాయి! ఈ విషయంలో ఒక్కోరి భావం ఒక్కోలా వ్యక్తం అవుతోంది. కొంతమందేమో.. కృష్ణా పుష్కరాల పాటిల అతి పెద్ద వీఐపీ, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పుష్కర స్నానం చేసే రోజున ఆ వైపు వెళ్లకండ్రోయ్.. అని బహిరంగ హెచ్చరికలు జారీ చేస్తుంటే, ప్రాణాలే హరించేస్తున్న బాబు గారి మార్కు ఏర్పాట్లపై మరికొంతమంది తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అలాంటి వాటిల్లో ఈ సోషల్ నెట్ వర్కింగ్ పోస్టు ఒకటి. వాట్సాప్ లో సర్కులేట్ అవుతున్న ఈ పోస్టు లో చెప్పిన తీరు సరదాగానే ఉన్నా, బాబు గారి అడ్మిస్ట్రేషన్ అంటే జనాల్లో ఎంత భయం ఉందో చాటి చెబుతోంది.


షరా: శ్రీమాన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబునాయుడుగారికి పర్సనల్ లెటరు పరులెవరూ చూడకూడదని చదవకూడదని మనవి…..


మరారా ముఖ్యమంత్రి వర్యులకు 
అనేక సాష్టాంగ దండప్రణామాలు ఆచరించి చేయు విన్నపములు
మహా దయగల అయ్యా!


                నా పేరు చేగోడీ చక్రధరరావు. నేను మన స్వర్ణాంధ్రప్రదేశ్ పమిడిమొలకల గ్రామ కాపురస్తుణ్ణి. ముఖ్యమంత్రి వర్యా తమరు గత సంవత్సరం గోదావరి పుష్కరాల సందర్భంగా చేసిన ఏర్పాట్లు అమోఘం. అనితరసాధ్యం. 
నిస్సంతు అయిన నా మేనమామ చనిపోతే ఆయన ఆస్తి నాకు కలసివస్తుంది. ఆయన చావు కోసం ఎన్నో ఏళ్లుగా నేను ఎదురు చూస్తూన్నాను. కానీ ఏడాదికేదాడి పొడిగించుకుంటూ బ్రతికేయడం వల్ల నా అనేక ఆర్ధిక సమస్యలు అపరిష్కృతంగా ఉండి నా జీవితాన్ని దుర్భరం చేసినవి. 


అటువంటిదిగత సంవత్సరం గోదావరి పుష్కర స్నానాలకని వెళ్లి మీరు చేసిన అద్భుతమైన ఏర్పాట్ల పుణ్యమా అని పుణ్యలోకాలకు చేరాడు. కేవలం మీ దయవల్లే నాకు మా మేనమామ ఆస్తి కలిసొచ్చిరుణ విముక్తుడనయ్యాను. హాయిగా జీవిస్తూన్నాను. 
ఇక పోతేమా పెదనాన్న ఒకాయన ఉన్నారు. ఆయన కూడా సిస్సంతేఆయన ఆస్తి కూడా నాకే కలసి రావాల్సి ఉంది.
మీరు కృష్ణా పుష్కరాలకు కూడా రాజమండ్రిని మించిన ఏర్పాట్లు చేస్తున్నట్టుగా మొన్న మీడియాతో అన్న మాటలు నాకు మిక్కిలి ఆనందం కలిగించినవి.


మీరు అదే మాట మీద ఉండిఅంతకు మించిన ఏర్పాట్లు కనుక చేసినట్టైతేఅలాగే మీ అడ్డాలో ఉన్న పండితులతో అందరూ రేవులోనే మునగండిపుణ్యమొస్తుంది లాంటి పిలుపులు ఇప్పించీ …(ఏదో నా ఆనందం కొద్దీ రాయడమే గానీ ఇవన్నీ మీకు తెలియనివి కావు.) మీరు చేస్తారునాకు తెలుసు 
అలా ఏర్పాట్లు చేసి మా పత్తండ్రిగారిని కూడా పుణ్యలోకాలకు పంపేస్తే జన్మాంతమూ కూడాను తమ దాసానుదాసుడనై ఉండగలవాడను. 


దయచేసి ఏర్పాట్ల విషయంలో మాత్రం రాజీపడద్దని నా మనవి. మన్నించగలరని ఆశిస్తూ 
అలాగే గోదావరి , కృష్ణా పుష్కరాల్లో కలిసొచ్చిన ఆస్తిలో ఒకటిన్నర శాతం ఎన్టీఆర్ ట్రస్టుకు జమచేయగలనని తెలియచేయుటకు గర్విస్తున్నాను.

ఇట్లు
మీ విధేయుడు 
చేగోడీ చక్రధరరావు
.

Show comments