ఇక్కడైతే 4 అక్కడైతే 1: ఇలియానా

''తెలుగులో ఒకే సంవత్సరం నాలుగు సినిమాలు చేయగలను.. కానీ బాలీవుడ్‌లో ఏడాదికి ఒక్క సినిమా చేయడం కూడా కష్టమే. అక్కడికీ, ఇక్కడికీ అదే తేడా. తెలుగులో సినిమాల నిర్మాణం చాలా వేగంగా జరుగుతుంది. అలాగే ఇక్కడి ప్రేక్షకులు చూపించే అభిమానం చాలా ప్రత్యేకం..'' 

- ఇదీ ఇలియానా మనసులో మాట. 

అయితే, ఇలియానా ఎందుకు టాలీవుడ్‌ని నిర్లక్ష్యం చేస్తోంది.? అవకాశాలు వస్తున్న సమయంలోనే ఇలియానా బాలీవుడ్‌కి వెళ్ళిపోయి, టాలీవుడ్‌ని ఎందుకు చిన్న చూపు చూసింది.? ఇలాంటి ప్రశ్నలు తెరపైకి రావడం సహజమే. 'జులాయి' సినిమా విషయంలో దర్శక నిర్మాతల్ని ఇలియానా చాలా ఇబ్బంది పెట్టేసింది. ఆ విషయమై అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది. 

బాలీవుడ్‌లో అవకాశం వచ్చేసరికి, ఇలియానా.. తనకు లైఫ్‌ ఇచ్చిన టాలీవుడ్‌ని లైట్‌ తీసుకుందన్నది నిర్వివాదాంశం. బాలీవుడ్‌కి వెళ్ళాకే అక్కడి ఇబ్బందులు ఇలియానాకి తెలిసొచ్చాయి. ఈలోగా, టాలీవుడ్‌లో ఆమె సీన్‌ సీతారయిపోయింది. మునుపటిలా అవకాశాలు రావడంలేదు. చేసేది లేక, బాలీవుడ్‌లోనే ఫిక్సయిపోయింది. ఇదీ వాస్తవం. ఇలియానా మాత్రం, చరణ్‌తో నటించాలని వుంది, టాలీవుడ్‌లో ఇంకా చాలామందితో నటించాలని వుందంటూ కొత్త కథలు చెబుతోంది.  Readmore!

తెలుగు సినిమాని ఎప్పటికీ మర్చిపోదట ఇలియానా. ఎందుకంటే, నటిగా తనకు లైఫ్‌ ఇచ్చింది టాలీవుడ్డేనని అంటూ ఇల్లీ బేబీ, టాలీవుడ్‌కి గాలమేస్తోందిప్పుడు. నిజమే, బాలీవుడ్‌లో ఒక సినిమా చేసే టైమ్‌లో టాలీవుడ్‌లో నాలుగు సినిమాలు చేసెయ్యొచ్చు. బాలీవుడ్‌తో పోల్చితే, ఇక్కడా రెమ్యునరేషన్‌ తక్కువేమీ కాదు. కానీ, బాలీవుడ్‌లో చేస్తే వచ్చే కిక్కే వేరు. ఆ కిక్కు కోసమే అసిన్‌ బాలీవుడ్‌కి వెళ్ళింది.. సౌత్‌లో స్టార్‌డమ్‌ని కోల్పోయింది. ఇలియానా కూడా అంతే. ఇలియానాతో పోల్చితే అసిన్‌ చాలా చాలా బెటర్‌. ఇలియానా పరిస్థితిప్పుడు బాలీవుడ్‌లో అస్సలేమాత్రం బాగాలేదు. అందుకే, టాలీవుడ్‌పై ఈ కొత్త ఫోకస్‌.. కొత్త ప్రేమ.!

Show comments

Related Stories :