'డోనర్‌'తో సుమంత్‌ కోరిక తీరేనా.?

సినిమా కాన్సెప్ట్‌ కాస్తంత ఇబ్బందికరమైనదే. కానీ, కొత్త కాన్సెప్ట్‌. అందునా, సినిమాని బాగా ఎగ్జిక్యూట్‌ చేశారు. అలా 'విక్కీ డోనర్‌' సినిమా బాలీవుడ్‌లో ఘనవిజయం సాధించింది. ఎంత పెద్ద విజయం సాధించిందంటే, ఆ సినిమాలో నటించిన యామీ గౌతమ్‌, ఆ సినిమా తర్వాత చాలా సినిమాల్లో నటించినా ఇంకా 'విక్కీ డోనర్‌' ఫేమ్‌.. అనే అంటుంటారు ఆమెని. 

ఇక, అదే సినిమాని తెలుగులోకి తీసుకొచ్చేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. ఓ నిర్మాత అయితే, రీమేక్‌ రైట్స్‌ తీసుకుని చాలామంది హీరోల చుట్టూ తిరిగాడు. తెలుగు, తమిళ సినిమాల్లో హీరోగా నటించిన ఓ 'కుర్రాడి' చుట్టూ తిరిగినా, 'ఇలాంటి సినిమాలు చేస్తే, ఇంకేమన్నా వుందా.?' అని సదరు హీరో చివరికి చేతులెత్తేశాడు. దాంతో, ఆ నిర్మాత ఆ సినిమాపై ఆశలు వదిలేసుకున్నాడు. 

ఎలా నచ్చిందో, ఏం ధైర్యం నడిపించిందోగానీ, ఈ సినిమా ఇప్పుడు సుమంత్‌ చేతిలో పడింది. ఈ మధ్య ఏ సినిమా చేసినా, పరాజయమే వెక్కిరిస్తోంది సుమంత్‌కి. అలాంటి సుమంత్‌, హ్యాపీగా సేఫ్‌ ప్రాజెక్ట్‌ ఏదో చెయ్యక, 'విక్కీ డోనర్‌' సినిమాని ఎంచుకున్నాడు. పైగా, దీనికి ఆయనగారే నిర్మాత. అక్కినేని నాగార్జున మద్దతుతో, సుప్రియ పర్యవేక్షణలో ఈ సినిమా తెలుగులోకి వస్తోంది. టైటిల్‌ 'నరుడా డోనరుడా'. సినిమా ఫస్ట్‌ లుక్‌ని అక్కినేని నాగార్జున విడుదల చేయడం గమనార్హం. 

సినిమా స్టిల్స్‌లో ఏముందో చూశారు కదా.! సుమంత్‌ అంటే ఫ్యామిలీ హీరో అని కాస్తో కూస్తో ఇంపాక్ట్‌ వుంది ఫ్యామిలీ ఆడియన్స్‌లో. కాన్సెప్ట్‌ వైజ్‌గా చూస్తే, సుశాంత్‌కి ఇది ఇబ్బందికరమే మరి.! చూద్దాం.. అతి తక్కువమంది ఆడియన్స్‌ని సెంటర్‌ చేస్తూ సుశాంత్‌ నటించి, నిర్మిస్తోన్న 'నరుడా డోనరుడా', హీరోగా ఎలాగైనా హిట్‌ కొట్టాలన్న సుమంత్‌ కోరికను తీర్చుతుందో లేదో.!

Show comments