ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా కూడా ఆ ఛానెల్ కే..!

ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ జనతా గ్యారేజీ. ఈ సినిమాను దక్కించుకున్న జెమినీ టీవీ.. ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా జై లవకుశ సినిమా శాటిలైట్ రైట్స్ ను కూడా సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం 14 కోట్ల రూపాయలకు "జై లవకుశ" శాటిలైట్ రైట్స్ డీల్ కుదిరింది.

జనతా గ్యారేజ్ సక్సెస్ తో ఎన్టీఆర్ మార్కెట్ వాల్యూ పెరిగింది. ప్రస్తుతం చేస్తున్న "జై లవకుశ" ప్రాజెక్టుపై చాలామంది కన్నుపడింది. పైగా ఇందులో ఎన్టీఆర్ మూడు గెటప్స్ లో కనిపించబోతున్నాడనే టాక్, సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచింది. అందుకే కొంతమంది బడా డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటికే నిర్మాత కల్యాణ్ రామ్ కు అడ్వాన్స్ లు ఇచ్చారు.

బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న జై లవకుశ సినిమాకు సంబంధించి ఇంకా ప్రీ-రిలీజ్ బిజినెస్ ప్రారంభించలేదు.  ఈ శాటిలైట్ రైట్స్ డీల్ తోనే బిజినెస్ ప్రారంభమైంది. సెంటిమెంట్ ప్రకారం, జనతా గ్యారేజ్ విడుదలైన సెప్టెంబర్ 1వ తేదీకే "జై లవకుశ"ను కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

Readmore!
Show comments

Related Stories :