విద్యాబాలన్‌లో ఈ కొత్త యాంగిల్‌ ఏంటో.!

'కహానీ-2' సినిమా దెబ్బ బాలీవుడ్‌ బ్యూటీ విద్యాబాలన్‌కి చాలా గట్టిగా తగిలినట్లుంది. 'ఇకపై కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాను..' అంటూ 'కహానీ-2' సినిమా ఫలితం తేడా కొట్టేయడంపై విద్యాబాలన్‌ వ్యాఖ్యానించింది. 'నా ఉద్దేశ్యం, కథ గురించి నేను పట్టించుకోలేదని కాదు.. అన్ని సందర్భాల్లోనూ అనుకున్నవి అనుకున్నట్లుగా జరగవు కదా..' అంటూ ముక్తాయింపునిచ్చింది విద్యాబాలన్‌. 

సినిమా కెరీర్‌ విషయంలో ఏమాత్రం రాజీ పడేది లేదని 'కహానీ-2' సినిమా ప్రమోషన్‌లో వ్యాఖ్యానించిన విద్యాబాలన్‌, ఇప్పుడు వీలైనంత ఎక్కువగా కుటుంబానికి సమయం కేటాయిస్తాననీ, పెళ్ళయ్యాక సినిమాకి ప్రయార్టీ పరంగా సెకెండ్‌ ప్లేస్‌ ఇవ్వక తప్పదని చెబుతోంది. నిజమే, విద్యాబాలన్‌లో చాలా మార్పులొచ్చాయి.. ఇది నిజంగానే కొత్త యాంగిల్‌.. అని బాలీవుడ్‌ సినీ జనం చెవులు కొరుక్కుంటున్నారు. 

అయితే, విద్యాబాలన్‌ ఇక్కడా కవరింగ్‌ ఇచ్చేసింది. 'ఫ్యామిలీకి టైమ్‌ కేటాయించడం తప్పెలా అవుతుంది.' అంటూ ఎదురు ప్రశ్నించిందీ బ్యూటీ. తెరపై గ్లామరస్‌గా కన్పించడం తప్పేమీ కాదని చెప్పిన నిన్నగాక మొన్న చెప్పిన విద్యాబాలన్‌, గ్లామర్‌ విషయంలో పెళ్ళయిన మహిళకి కొన్ని రిస్ట్రిక్షన్స్‌ తప్పవు కదా.. అంటూ ఇప్పుడు కొత్త పాఠాలు చెబుతోంది. ఇదంతా 'కహానీ-2' ఎఫెక్ట్‌ అనుకోవాలా.? ఏమో మరి, ఆమెకే తెలియాలి.

Readmore!
Show comments