‘’అసలు జగన్ కు కొంచెమైనా బాధ్యత ఉందా? అమరావతిలో నేల కుంగిపోతే… బ్రిటన్ లో విహరిస్తాడా? ఇక్కడ కాపుల రిజర్వేషన్ల వ్యవహారంతో రాష్ట్రం అట్టుడుకుతుంటే.. అక్కడ గోల్ఫ్ ఆడతాడా? ఇలాగే ప్రతిపక్ష నేత ఉండాల్సింది? జనాలు సమస్యలతో సతమతమవుతుంటే.. జగన్ మాత్రం విహారయాత్రకు వెళతాడా?’’
అంటూ మొదలుపెట్టి… ‘’జగన్ విహార యాత్రకు వెళ్లడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో అసహనం వ్యక్తం అవుతోంది. ఈ విషయంలో ముఖ్య నేతలు చాలా ఫీల్ అవుతున్నారు. జగన్ విషయంలో వారు కినుక వహించారు. పార్టీ నుంచి ఎమ్మెల్యేలు బయటకు వెళ్లిపోతుంటే.. ఇలాంటి సమయంలో జగన్ విహార యాత్రకు వెళ్లడం బాధకరం అంటూ మాతో చెబుతున్నారు..’’ అనేంత వరకూ వెళ్లిపోయింది తెలుగుదేశం అనుకూల మీడియా!
జగన్ మోహన్ రెడ్డి బ్రిటన్ లో గోల్ఫ్ ఆడుతున్న ఫొటోలు వెలుగులోకి రావడం తెలుగుదేశం అభిమానులను చాలా ఇబ్బంది పెట్టేసినట్టుంది. ఈ ఫొటోల్లో జగన్ టైగర్ వుడ్స్ ను తలదన్నుతున్నాడని జగన్ అభిమానులు మురిసిపోతుంటే.. తెలుగుదేశం అనుకూల వార్తా ఛానళ్లు, వెబ్ సైట్లు మాత్రం ఏడ్చి పెడబొబ్బలు పెడుతున్నాయి.
ఇదంతా జగన్ మోహన్ రెడ్డి బాధ్యతారాహిత్యం.. ఈ విషయంలో వైకాపా నేతలు చాలా బాధపడుతున్నారు.. అని చెప్పడం ఈ మీడియా వర్గం తరపున హైలెట్. ఈ మధ్య కాలంలో జగన్ మీద తెలుగుదేశం వాళ్లు ఇంతలా ఏడ్చిన సందర్భాలు లేవు. బ్రిటన్ పర్యటనతో పచ్చ బ్యాచ్ కు ఒక రేంజ్ కడుపుమంటను పుట్టిచ్చాడు జగన్ రెడ్డి.
అయినా.. జగన్ జనాల్లోకి వెళితే ఒక రకంగా విరుచుకుపడతాడు. జగన్ జనాల్లోకి వెళితే అభివృద్ధి నిరోధకుడు మొర్రో అంటూ మొత్తుకుంటారు. తెలుగుదేశం పార్టీ హామీ అయిన కాపుల రిజర్వేషన్ అంశం గురించి మాట్లాడితే జగన్ కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడు అంటారు. కాస్త విరామం తీసుకుని, విహారానికి వెళితే బాధ్యత లేదా? అంటారు. మొత్తానికి ఎలా చూసినా పచ్చ గుండెలను పిండేస్తున్నాడు జగన్ మెహన్ రెడ్డి. అధికారంలో ఉన్నామన్న ఆనందాని కన్నా.. జగన్ మీద ఏదో విధంగా ఏడుస్తూ పడుతున్న బాధే ఎక్కువ అవుతోంది పాపం!
బహుశా ఇక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గాలి ముద్దుకృష్ణమనాయుడు వంటి వాళ్లు ఎవరైనా జగన్ ఫొటోలపై ప్రెస్ మీట్ పెట్టడడమే మిగిలింది. ఆ ఏడుపు ఎలా ఉంటుందో.. అందులోని పెడబొబ్బలు ఏమిటో వెయిట్ అండ్ సీ!