దర్శకుడితో హీరోయిన్ డేటింగ్!

సనా ఖాన్.. గుర్తుందా? ఆ మధ్య ‘కల్యాణ్ రామ్ - కత్తి’ తో పాటు కొన్ని తెలుగు సినిమాల్లో, తమిళం నుంచి డబ్బింగ్ అయిన కొన్ని సినిమాల ద్వారా ఆమె తెలుగు వారికి పరిచయం. అంతగా సక్సెస్ కాలేకపోయింది కానీ.. తన అందాల ప్రదర్శనతో మరిచిపోనీయకుండా చేసింది ఈ ముంబై భామ.

దక్షిణాదిన నిలదొక్కుకోలేకపోయిన సనా ఇప్పుడు బాలీవుడ్ లో అవకాశాలు వెదుక్కొనే పనిలో ఉంది. ఈమె సినిమాల సంగతలా ఉంటే.. విశాల్ పాండ్యా అనే దర్శకుడితో సనా డేటింగ్ లో ఉందని వార్తలు వస్తున్నాయి. ‘హేట్ స్టోరీ-2’ వంటి సినిమాలు రూపొందించిన విశాల్ తో  సనా ప్రేమలో పడిందట. మొత్తానికి ఈ విధంగా వార్తల్లోకి వచ్చింది సనా ఖాన్.

డేటింగ్ లో ఉన్న ఈ జంట రాబోయే తమ తమ సినిమాల ఫలితాల కోసం ఆసక్తిగానే ఎదురుచూస్తోంది.  

Show comments