గద్దర్‌, పవన్‌.. ఎక్కడ చెడింది?

'అవసరమైతే వామపక్షాలతో కలిసి పనిచేస్తాం..' అని పలు సందర్భాల్లో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ చెప్పడం, పవన్‌ నుంచి సానుకూల పవనాలు రావడంతో, పవన్‌కళ్యాణ్‌ని కొంతమేర ప్రసన్నం చేసుకునేందుకు వామపక్షాలు ప్రయ త్నించడం చూస్తూనే వున్నాం. అయితే, పవన్‌కళ్యాణ్‌ అంతతేలిగ్గా చంద్రబాబు కబంధహస్తాల్లోంచి బయటకొచ్చే పరిస్థితుల్లోవని వామపక్షాలకు అర్థమయిపోయింది. అయినాసరే, ఏమోగుర్రం ఎగరావచ్చు.. అన్నట్టు, పవన్‌ కోసం వామపక్షాలు ఎదురు చూస్తూనే వున్నాయి. 

ఇంకోపక్క, కొత్త రాజకీయ వేదికదిశగా పావులు కదుపుతున్న 'ప్రజాయుద్ధ నౌక' గద్దర్‌, పవన్‌కళ్యాణ్‌తో 'భేటీ' అయ్యేందుకు చాలా ప్రయత్నాలే చేశారట. పవన్‌కళ్యాణ్‌ పార్టీ జనసేనతో కలిసి పనిచేయడం లేదంటే, తెలంగాణలో జనసేన పార్టీకి నాయకత్వం వహించడం వంటి ప్రపోజల్స్‌తో గద్దర్‌, తన సన్నిహితుల్ని పవన్‌కళ్యాణ్‌ వద్దకు పంపారట. అయితే, గద్దర్‌ ప్రతిపాదనల్ని పవన్‌ సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. 'పవన్‌కళ్యాణ్‌ అపాయింట్‌మెంట్‌ నాకు దొరకలేదు..' అని గద్దర్‌ ఓ సందర్భంలో నోరు జారేశారు. దాంతో, ఈ మొత్తం ఎపిసోడ్‌పై ఓ క్లారిటీ వచ్చేసింది. 

గద్దర్‌ రాజకీయాల్లోకి వస్తాననే వ్యాఖ్యలు ఈనాటివి కావు. ఆయన తనవంతుగా ప్రయత్నాలైతే చేస్తున్నారుగానీ, అవి సీరియస్‌గా వుండడంలేదంతే. అందుకనే, పవన్‌ కూడా గద్దర్‌ని లైట్‌ తీసుకున్నారన్నది ఓ వాదన. ఇంకోపక్క, అసలు పవన్‌కళ్యాణ్‌కే రాజకీయాలపట్ల సీరియస్‌నెస్‌ లేనప్పుడు, గద్దర్‌ విషయంలో పవన్‌ లైట్‌ తీసుకోవడమేంటన్నది ఇంకో వాదన. అయినా, గద్దర్‌ విషయంలో ఎప్పుడూ పాజిటివ్‌గా వుండే పవన్‌, ఇప్పుడెందుకు గద్దర్‌ని పొలిటికల్‌గా ఎంటర్‌టైన్‌ చేయడానికి ఇష్టపడటంలేదట.?

Show comments