కొంచెం తగ్గించాలి నానీ

'మజ్ను' బాగుందని అందరూ చెప్పుకున్నా, మంచి రేటింగులే వచ్చినా కానీ బాక్సాఫీస్‌ వద్ద అనుకున్న ఫలితం రాలేదు. బయ్యర్లందరూ మంచి రేట్లకి అమ్ముకుని లాభాలు గడించారు కానీ థర్డ్‌ పార్టీల వాళ్లు చేతులు కాల్చుకున్నారు. ప్రధానంగా ఓవర్సీస్‌లో ఈ చిత్రం అంచనాలని తలకిందులు చేసింది.

ఇటీవల నాని చేసిన సినిమాల్లో మజ్ను ఇంత అండర్‌ పర్‌ఫార్మ్‌ చేయడానికి కారణమేంటి? మరీ తన సినిమాల మధ్య ఎక్కువ గ్యాప్‌ ఉండకపోవడం వల్లే ఇలా జరుగుతోందని విశ్లేషకులు అంటున్నారు. ఎంత చిన్న హీరో అయినా కానీ అదే పనిగా సినిమాలు రిలీజ్‌ చేస్తుంటే, అన్నిటినీ చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపించరు.

అవకాశాలు వస్తున్నాయి కదా అని తీరిక లేకుండా చేసుకుంటూ పోతోన్న నాని కాస్త వేగం తగ్గించాలి. ఈ రోజుల్లో ఏడాదికి రెండుకి మించి సినిమాలు చేయాల్సిన పని లేదు. మరీ రెండు, మూడు నెలలకో సినిమా విడుదల చేస్తే తన సినిమా వచ్చిందనే ఆసక్తి, కుతూహలం లేక ప్రేక్షకులు థియేటర్ల వైపు రాను కూడా రారు. 

Show comments