ప్రస్తుతం జై లవకుశ సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. సెట్స్ పై ఉన్న మూవీ ఇదొక్కటే. రవితేజ మాత్రం ఒకేసారి 2 సినిమాలు చేస్తున్నాడు. రాజా ది గ్రేట్ మూవీతో పాటు "టచ్ చేసి చూడు" అనే మరో మాస్ ఎంటర్ టైనర్ లో కూడా నటిస్తున్నాడు. వీటిలో ఒక సినిమాను ఎన్టీఆర్ మూవీకి పోటీగా బరిలోకి దించుకున్నాడు మాస్ రాజా.
ఎన్టీఆర్, రవితేజ సినిమాలు బాక్సాఫీస్ బరిలోకి దిగడం లేదు. టీజర్స్ తో పోటీపడబోతున్నాయి. అవును.. ఈ రంజాన్ కు జై లవకుశ టీజర్ ను విడుదల చేయాలనుకుంటున్నాడు ఎన్టీఆర్. అదే రోజు తన కొత్త సినిమా "టచ్ చేసి చూడు" ఫస్ట్ లుక్ టీజర్ ను లాంచ్ చేయాలని అనుకుంటున్నాడు రవితేజ.
విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది "టచ్ చేసి చూడు". ఈ మూవీలో రవితేజ మరోసారి పోలీస్ గా కనిపించబోతున్నాడట. సినిమా ఓపెనింగ్ రోజునే కొన్ని స్టిల్స్ తో పాటు టైటిల్ లోగోను కూడా విడుదల చేశారు. తాజాగా మరికొన్ని స్టిల్స్ తో పాటు టీజర్ ను విడుదల చేస్తారట.
జై లవకుశ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజైంది. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాశిఖన్నా, నివేదా థామస్ హీరోయిన్లు. సెప్టెంబర్ లో మూవీ రిలీజ్ అనుకుంటున్నారు. టీజర్ లో ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది.