ఎవరేమనుకున్నా 'వంగవీటి' 23నే

వంగవీటి సినిమా వ్యవహారాలు చకచకా ఒక కొలిక్కి వచ్చేసాయి. సినిమాను మరో రెండు రోజుల్లో సెన్సారు ముందుకు తెస్తున్నారు. 23న విడుదలకు అన్ని సన్నాహాలు చేస్తున్నారు. అదే రోజు తమిళ సూపర్ స్టార్ సూర్య నటించిన సింగం, కమెడియన్ సప్తగిరి నటించిన సప్తగిరి ఎక్స్ ప్రెస్ విడుదలవుతున్నాయి. 

సింగం లాంటి మాస్ మసాలా సినిమా, సప్తగిరి లాంటి ఫన్ ఎంటర్ టైన్ మెంట్ మూవీ వుండగా వంగవీటిని విడుదల చేయాలని వర్మ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. సరే, సినిమాల సంగతి ఎలా వున్నా, వంగవీటి రాధాకృష్ణ, రత్నకుమారి తదితరుల నుంచి వచ్చిన అభ్యంతరాలు, బెదిరింపులను కూడా వర్మ పట్టించుకోలేదు. 

వంగవీటికి పెద్దగా అభ్యంతరాలు రావు అనే భావిస్తున్నారు.  వచ్చినా వాటిని పెద్దగా పట్టించుకోనక్కరలేదని కూడా డిసైడ్ అయిపోయినట్ల బోగట్టా. మరీ కోర్టుల నుంచి బ్రేక్ లు వస్తే తప్ప, 23న విడుదల చేయాలనే వర్మ అనుకుంటున్నారట.

Readmore!
Show comments

Related Stories :