నయన్ కరుణించిందా?

బాబు బంగారం ప్రారంభించింది మొదలు... హీరోయిన్ నయనతార డేట్లతో ట్రబులే ట్రబుల్.. లేదూ అంటే ఈ పాటికే ఆ సినిమా పూర్తయిపోయి వుండాలి. ఆమె డేట్ల కోసం విక్టరీ వెంకటేష్ వేచి వుండాల్సి వచ్చింది. ఆమె ఇచ్చినపుడే షూట్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు చివరికి ఓ వారం రోజుల వర్క్ వుండిపోయిందట. కోరగా.. కోరాగా కరుణించి, ఇప్పుడు డేట్లు ఇచ్చిందట. 

దాంతో బాబు బంగారం వర్క్ ఫినిష్ చేసేయాలని చకచకా కానిచ్చేస్తున్నారు.  వాస్తవానికి జూన్ ఫస్ట్ వీక్ లో రావాల్సిన సినిమా జూలై లాస్ట్ వీక్ కు షెడ్యూలు చేసుకున్నారు. కబాలి కాస్త అటు ఇటు అయినా ఫరవాలేకుండా లాస్ట్ వీక్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇదిలా వుంటే అదే నెల ఫస్ట్ వీక్ లో బాబు బంగారం డైరక్టర్ మారుతి కథ, భాగస్వామ్యంలోని రోజులు మారాయి సినిమా విడుదల కూడా వుంది. 

ఆ సినిమాకు కేవలం మారుతి కథే అందించినా, ఆ సినిమా హిట్ లేదా మరే విధమైన ఫలితమైనా బాబు బంగారం మీద కూడా వుంటుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

Show comments