వేచి ఉండమంటూ.. ఊరిస్తున్న మిల్కీ బ్యూటీ!

ఈ ఏడాది చాలా సంతృప్తి కలిగింది.. అంటోంది తమన్నా భాటియా. అటు బాలీవుడ్ లో ఇటు సౌత్ లో విజయాలను సొంతం చేసుకున్నాను అని సంతోషంగా చెబుతోంది తమ్మూ. ‘ఊపిరి’ సినిమాతో తమిళ, తెలుగు భాషల్లో విజయం సొంతం చేసుకోవడం, ‘అభినేత్రి’ హిందీ వెర్షన్ పర్వాలేదనిపించడం, కొన్ని ఐటమ్ సాంగ్స్ లో నర్తించడం.. ఇవన్నీ ఆనందాన్నిస్తున్నాయని తమన్నా చెప్పుకొచ్చింది.

ఈ సంగతిలా ఉంటే.. త్వరలోనే అందరినీ ఆశ్చర్యపరుస్తా.. అని అంటోంది తమన్నా. తను ప్రకటించే విషయంతో అంతా సంభ్రమాశ్చర్యానికి గురి అవుతారని తమన్నా చెప్పింది. 

ఏంటి? అంతలా ఆశ్చర్యపరుస్తానంటున్నావ్.. చేసే ప్రకటనతో అంతా షాక్ అవుతారని అంటున్నావ్…వివాహ ప్రకటన కానీ చేస్తావా ఏంటి? అంటే, అబ్బే అదేం కాదు, సినిమాల గురించే అని చెబుతోంది తమన్నా.

తను నటించబోయే సినిమాల గురించి, ఆ కాంబినేషన్ల గురించి అనౌన్స్ చేస్తానని అప్పుడు అంతా ఆశ్చర్యపోతారని ఈమె చెబుతోంది. అంతలా.. ఆశ్చర్య పరిచే విషయాలేంటి? అంటే.. ‘ఇప్పుడేం అడగొద్దు.. ఇప్పుడేం చెప్పలేను.. త్వరలోనే చెబుతాను, అందరినీ ఆశ్చర్యపరుస్తాను..’ అంటూ ఊరిస్తోంది. ఆ సినిమాల కాంబినేషన్ల గురించి చెబితే అంతా సర్ ప్రైజ్ అవుతారని.. మాత్రం ఒత్తి చెబుతోంది. ఒక సినిమా అని కాదు.. తను నటించబోయే కొన్ని సినిమాలే ఆశ్చర్యపరచబోతాయని ఈమె అంటోంది. మరి ఆ సినిమాలేవో తెలుసుకోవాలన్నా.. కలిగే ఆ ఆశ్చర్యాన్ని ఆస్వాధించాలన్నా వేచి చూడాలి!

Readmore!

Show comments