బాబు వస్తే జాబు వస్తుంది..దాంతో తలసరి ఆదాయం పెరుగుతుంది.
బాబు వస్తే వ్యవసాయం లాభసాటి అవుతుంది.దాంతో తలసరి ఆదాయం పెరుగుతుంది
బాబు వస్తే అవినితి నిర్మూలన ఖాయం..దాంతో జనాల దగ్గర డబ్బులు పెరుగుతాయి.
ఇలా బాబు వస్తే..వస్తే..లు ఇంకా చాలానే వున్నాయి.
అయితే వాస్తవం ఏమిటంటే..అంటే ప్రభుత్వాలు చేయించిన సర్వేలో తేలింది ఏమిటంటే, ఆంధ్ర రాష్ట్రంలో అవినీతి పెరిగింది. తలసరి ఆధాయం విషయంలో జిల్లాల స్థాయి మాత్రం పెరగలేదు. ఇది ఎవరూ గిట్టక చెప్పిన విషయం కాదు. బాబుగారి సర్వేలోనే తేలిన విషయం.
అవినీతి నెలకొంది అని జనం సర్వేలో ఎలా చెప్పారో చూడండి..రెవెన్యూలో అవినీతి వుందని 45 శాతం, పోలీసు శాఖలో అవినీతి వుందని 13.7శాతం వుందని, వైద్య ఆరోగ్య శాఖలో అవినీతి వుందని 7.5 శాతం మంది సర్వేలో అభిప్రాయ పడ్డారు.
తలసరి ఆదాయం అంతే
బాబు అధికారంలోకి రావడానికి ముందు రాష్ట్రంలోని జనాల తలసరి ఆదాయం జిల్లాలు ఎలా వున్నాయో, ఇప్పటికీ అలాగే వున్నాయట. అప్పట్లో విశాఖ, విజయవాడ ఫస్ట్ అండ్ బెస్ట్. శ్రీకాకుళం లాస్ట్. ఇప్పుడూ అంతేనట. ముందున్న జిల్లాలు ముందుగానే వుంటున్నాయి. వెనుకబడిన జిల్లాలు వెనకబడే వున్నాయట. అంటే మరి వీటిపై ఏ మేరకు దృష్టి సారించినట్లు?
విశాఖను విజయవాడను ఏమీ చేయక్కరలేదు. అవి ట్రాక్ పైకి ఏనాడో వెళ్లిపోయాయి. ట్రాక్ ఎక్కని శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు, అనంతపురం వంటి జిల్లాల సంగతి చూడాల్సి వుంది. మోడీ ఫ్రభుత్వం ఏమీ ఇవ్వకున్నా రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక నిధులు ఇవ్వడం మొదలు పెట్టింది. మరి అవి దేనికి మళ్లిపోయాయో? ఏమో?
మొత్తం మీద బాబు వచ్చి, తెచ్చిన మార్పేమిటంటే అవినీతిని పెంచడం తప్ప వేరు కాదేమో?