రష్మికన్నా అనసూయే బెటర్‌ కదా.!

అవకాశాలు వచ్చిపడ్తున్నా అనసూయ ఆచి తూచి అడుగులేస్తోంది. రష్మి మాత్రం అలా కాదు, ఛాన్సొస్తే ఎగిరి గంతేసేస్తోంది. 'గ్లామరస్‌ పాత్రలే చేస్తా.. అఫ్‌కోర్స్‌ అందులో నటనకీ ప్రాధాన్యముంటుంది లెండి..' అయినా వచ్చిన అవకాశన్ని వదిలేసుకుంటే ఎలా.? అని ప్రశ్నించడం రష్మికే చెల్లుతుంది. రష్మి, అనసూయ ఇద్దరూ బుల్లితెర నుంచి వెండితెరకు ప్రమోట్‌ అయినవారే. సినిమాల పరంగా రష్మి, అనసూయకి సీనియర్‌. 

అయినాసరే, అనసూయ కెరీర్‌ ప్లానింగ్‌ డిఫరెంట్‌గా కన్పిస్తోంది. రష్మి అలా కాదు. 'ఎటాక్‌' సినిమా చేసిన అనసూయ, ఆ తర్వాత మరో సినిమా చేయడానికి చాలా టైమ్‌ తీసుకుంది. గ్లామర్‌లో రష్మికి తక్కువేం కాదు అనసూయ. కానీ, కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటోంది. రష్మి రూటే సెపరేటు. ఆమెకున్న క్రేజ్‌ కారణంగా సినిమాలో చిన్న పాత్ర ఇచ్చేసి, ఆమెను పబ్లిసిటీలో హైలైట్‌ చేసేస్తున్నారు. ఎలాగైతేనేం, హీరోయిన్‌ అనిపించేసుకుంటున్నా కదా.. అన్నది రష్మి నైజం. 

ఇలాగే ఎన్నాళ్ళు రష్మి తన కెరీర్‌ని నెట్టుకొచ్చేస్తోందోగానీ, అసలు రష్మి చేసిన సినిమాలేంటి.? చేస్తున్న సినిమాలేంటి.? అనేది మాత్రం ఎవరికీ గుర్తుండడంలేదు. 'గుంటూరు టాకీస్‌' నుంచి 'తను వచ్చెనంట' వరకూ రష్మి చాలా సినిమాలే చేసింది. ప్చ్‌, ఏదీ హిట్టవడం జరగలేదు సరికదా, ఏ సినిమా కూడా ఎవరికీ గుర్తు లేదు. అన్నట్టు, ఆమెకైనా ఆమె చేసిన సినిమాలు గుర్తుంటున్నాయా.?

Show comments