ఆ హీరోయిన్ పైనే ఎందుకన్ని గ్యాసిప్ లు

ఇంచుమించు ఒకేసారి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ముగ్గురు ఆర్ హీరోయిన్లలో ఆమె ఒకరు. కానీ చకచకా చాన్స్ లు అందిపుచ్చుకుని, ఆపై హిట్ లు ఖాతాలో వేసుకుని పైపైకి వెళ్లిపోయింది. రెమ్యూనిరేషన్ లో పెద్దగా బిగుసుకు వుండదని, యాభై లక్షల నుంచి కోటి రూపాయిల వరకు ప్రాజెక్టును బట్టి తీసుకుంటుందని వినికిడి. 

అయితే ఇందుకు అదనంగా, ఆమె ఏ సినిమాలో నటిస్తే, ఆ హీరోతో మాంచి సాన్నిహిత్యం ఏర్పాటు చేసుకుంటుందని, ఆమె కంపెనీని సదరు హీరోలు కాదనలేని స్థితికి చేరుకుంటారని గ్యాసిప్ లు ఇండస్ట్రీలో వినిపిస్తుంటాయి. వాస్తవానికి ఆమె ఎర్లీడేస్ లోనే ఓ యంగ్ హీరోతో సాన్నిహిత్యంగా వుండేదని, అయితే ఆ మధ్య అది బ్రేకప్ అయిందని టాక్. 

ఆ సంగతి అలా వుంచితే, దాదాపు చాలా మంది హీరోలతో ఆమె మాంచి సాన్నిహిత్యం పెంచుకుంటుందని టాక్ ఎందుకు వస్తోందన్నది పాయింట్. ఇలాంటి గ్యాసిప్ లను, జనాల టాక్ ను, ఆమె పట్టించుకోదని, తాను ఎలా వుండాలని అనుకుంటుందో అలా వుంటుందని, అందుకే ఇలా మరిన్ని గ్యాసిప్ లు వినిపిస్తున్నాయని ఇండస్ట్రీ జనాల టాక్. ఏమైనా టాలెంట్, అవకాశాలు మాత్రమే కాదు, వీలయినంత వరకు ఇలాంటి వ్యవహారాలు కూడా క్రాపప్ కాకుండా చూసుకోవడం అవసరమేమో?

Show comments