చిన్న వయసులోనే హీరోయిన్‌గా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చేసుకుంది బాలీవుడ్ బ్యూటీ అలియా బట్. ఇప్పటిదాకా అలియా డ్రెస్సింగ్ విషయంలో చాలా ప్రశంసలే అందుకుంది. అప్పుడప్పుడూ ఆమె డ్రస్సింగ్ విషయంలో నెగెటివ్ కామెంట్స్ విన్పించినా, ట్రెండీ ఔట్ ఫిట్స్‌తో అందరి దృష్టినీ తనవైపుకు తిప్పుకోవడంలో అలియా తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది.
తాజాగా అలియా, డిఫరెంట్ ఔట్ ఫిట్‌లో కన్పించి బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. గ్లామర్ అండ్ స్టైల్ అవార్డ్స్ కవర్ లాంఛ్ సందర్భంగా అలియా ఇదిగో ఇలా కన్పించింది. స్టైల్ అంటే స్టైలే.. ట్రెండీ అంటే ట్రెండీనే.. కానీ, అలియా డ్రెస్సింగ్ పరమ బ్యాడ్‌గా వుందని బాలీవుడ్ సినీ జనం చెవులు కొరుక్కుంటున్నారు.
అయితే అలియా మాత్రం, ట్రెండీగా వుండడంలో తనకు తానే సాటి అని అంటోంది. అబ్సొల్యూట్ ఎలిక్స్ ఫిలింఫేర్ గ్లామర్ అండ్ స్టైల్ అవార్డ్ కవర్ లాంఛ్ ఈవెంట్ కోసం తాను ఎన్నో కసరత్తులు చేసి, ఈ ఔట్ ఫిట్‌ని ఫైనల్ చేశానని చెబుతోంది అలియా. ఏమో, అలియా ఎంత కష్టపడిందోగానీ, ఆమె డ్రెస్సింగ్‌కి మాత్రం నెగెటివ్ మార్కులు పడుతున్నాయి. అయితేనేం, అలియా మాత్రం చాలా హాట్ హాట్‌గా వుంది ఈ ఔట్ ఫిట్‌లో కూడా.