బాలీవుడ్‌లో ఓ సెక్షన్ దర్శక నిర్మాతలు, హిందీ సినిమాని రానురాను హాలీవుడ్‌ని మించిపోయి, పోర్న్ సినిమాలతో పోటీ పడేలా చేయాలనుకుంటున్నట్టున్నారు. ఇదిగో, పైన ఫొటోలో మీరు చూస్తున్న ఫొటో ఓ హిందీ సినిమాలోనిదే. 'ఇష్క్ జునూన్' సినిమాలోని స్టిల్ ఇది. ఇద్దరు హీరోలు, ఓ హీరోయిన్.. ఈ కాన్సెప్ట్‌తో చాలా సినిమాలొచ్చాయి. ట్రయాంగిల్ లవ్ స్టోరీ అప్పటికీ ఇప్పటికీ ఎవ్వర్‌గ్రీన్ కాన్సెప్ట్. కానీ, ఇది లవ్ కాదు, కొవ్వు.
పోర్న్ సినిమాల్లో కన్పించే 'త్రీసమ్'ని మన ట్రెండ్‌కి తగ్గట్టుగా కాస్త మార్చి, 'ఇష్క్ జునూన్' పేరుతో భారతీయ సినిమా ప్రేక్షకుల ముందుకు వదులుతున్నారు. నవంబర్ 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సంజయ్ శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రాజ్‌బీర్‌సింగ్, దివ్యా సింగ్, అక్షయ్ రంగ్‌షాహి ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు.
మూగ ప్రేమ, చెవిటి ప్రేమ, గుడ్డి ప్రేమ కాదిది.. వైల్డ్ ప్రేమ. అసలిది ప్రేమే కాదు. రొమాన్స్ అంతకన్నా కాదు. వైల్డ్ అడల్ట్ కంటెంట్ అంతే. సెన్సార్ బోర్డ్ ఒప్పుకుంటుందా.? అనడక్కండి. అదంతే. గే, లెస్బియన్ సినిమాలెలా వస్తున్నాయో.. ఇది కూడా అంతే. సినిమా ట్రైలర్లు, టీజర్లు, సాంగ్ ప్రోమోలు ఇప్పటికే ఇంటర్నెట్‌లో ఓ రేంజ్‌లో హీట్ పుట్టించేస్తున్నాయి. సినిమా విడుదలయ్యాక సంచలనమే అవుతుందో, వివాదం ముదిరి పాకాన పడుతుందో వేచి చూడాల్సిందే.