'గ్యారేజ్‌'తో ఎన్టీఆర్‌ బెంచ్‌ మార్క్‌.?

జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'జనతా గ్యారేజ్‌' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అతి త్వరలో ఆడియో రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నారు. సెప్టెంబర్‌ మొదటి వారంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం విదితమే. జూనియర్‌ ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ పరంగా సరికొత్త రికార్డుల్ని ఇప్పటికే నమోదు చేస్తోంది 'జనతా గ్యారేజ్‌'. 

బ్యాక్‌ టు బ్యాక్‌ రెండు హిట్స్‌తో టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్స్‌లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా కావడంతో 'జనతా గ్యారేజ్‌'కి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ కన్పిస్తోంది. ఇంకోపక్క, 'టెంపర్‌' తర్వాత ఈ సినిమాతో ఎన్టీఆర్‌ మరో సెన్సేషనల్‌ హిట్‌ని తన ఖాతాలో వేసుకుంటాడని అభిమానులు అంచనా వేస్తున్నారు. 

ఇదిలా వుంటే, గత కొన్నాళ్ళుగా డాన్సుల్లో జూనియర్‌ ఎన్టీఆర్‌ 'అప్‌ టు ద మార్క్‌' అనే స్థాయిలో సత్తా చాటలేకపోతున్నాడన్నది నిర్వివాదాంశం. 'టెంపర్‌'లో మాత్రం అదరగొట్టేశాడు. 'జనతా గ్యారేజ్‌' సినిమాలో ఎన్టీఆర్‌ చేసిన డాన్సులైతే టాలీవుడ్‌కి సరికొత్త బెంచ్‌ మార్క్‌ని సెట్‌ చేసినట్లేనని ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ ద్వారా తెలుస్తోంది. టాలీవుడ్‌ టాప్‌ డాన్సర్స్‌లో ఎన్టీఆర్‌ కూడా ఒకడే అయినా, ఎందుకో ఈ మధ్య అంతగా తన టాలెంట్‌ని ఎన్టీఆర్‌ చూపించడంలేదు. మరిప్పుడు 'జనతా గ్యారేజ్‌'తో ఎన్టీఆర్‌ బెంచ్‌ మార్క్‌ సెట్‌ చేయడం ఖాయమేనా.? అదే నిజమైతే, అభిమానులకు అంతకన్నా కావాల్సిందేముంటుంది.?

Show comments