అలనాటి మేటి హాస్య నటుడు అల్లు రామలింగయ్య పెద్ద కుమార్తె, నేటి మేటి నిర్మాత అల్లు అరవింద్ సోదరి, బన్నీ మేనత్త అయిన అల్లు భారతి మృతి చెందారు. ఆమె అవివాహిత. వార్థక్యం కారణంగా ఆమె గడచిన కొంత కాలంగా అనారోగ్యంతో వున్నారు.
ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ పొందుతూ ఈ రోజు మరణించినట్లు తెలుస్తోంది. ఈ కారణంగా అల్లు ఫ్యామిలీ అంతా సంతాపంలో మునిగిపోయింది. దీంతో ధృవ ప్రమోషన్లకు సంబంధించిన కార్యక్రమాలను కూడా రామ్ చరణ్ రద్దు చేసుకున్నారు.