బాలీవుడ్ లో ప్రభాస్ ముచ్చట్ల మజా!

మీకు తెలుసా? కంగనా రనౌత్ ఇది వరకే బాహుబలి ప్రభాస్ సరసన నటించింది! ప్రభాస్ ఇది వరకూ నటించిన కొన్ని సినిమాలు హిందీలోకి డబ్ అయ్యాయి! మరి కొన్ని సినిమాలను హిందీలో రీమేక్ కూడా చేశారు… ఇలా సాగుతున్నాయి బాలీవుడ్ పత్రికల సినిమా వార్తలు!

బాహుబలి హీరో ప్రభాస్ గురించి చెప్పడానికి హిందీ పత్రికలు పోటీ పడుతున్నాయి. దీనిపై పెద్ద రీసెర్చ్ చేసి.. ఫిల్మీ ట్రివియాను అందిస్తున్నాయి. ప్రభాస్ గురించి ఫన్ ఫ్యాక్ట్స్ ను వివరించుకొస్తున్నాయి. ప్రభాస్ కెరీర్ ఎప్పుడు ఎలా మొదలైంది, అతడి తొలి సినిమా ఏదీ, అతడి నేపథ్యం ఏమిటి? అనే విషయాలపై బోలెడన్ని ఆర్టికల్స్ ప్రచురితం అవుతున్నాయి బాలీవుడ్ వార్తా పత్రికల్లో!

ప్రభాస్ కుటుంబ రాజకీయ నేపథ్యం గురించి కూడా పత్రికలు చెబుతున్నాయి. పరోక్షంగా ఇతడు బీజేపీ వాడే సుమా. అనే అంశాన్ని కూడా నొక్కి చెబుతున్నాయి. ప్రభాస్ ఇంత వరకూ రాజకీయాసక్తులేవీ చెప్పుకోనప్పటికీ, అతడి పెదనాన్న నేపథ్యాన్ని బట్టి.. మీడియా వర్గాలు.. ఈ హీరోని బీజేపీ సానుభూతి పరుడిగా చూపించేస్తున్నాయి.

బాలీవుడ్ కు సుపరిచితులైన వారెవరికి ప్రభాస్ తో పని చేసిన అనుభవం ఉంది, వారు ప్రభాస్ గురించి ఎలాంటి అభిప్రాయాలను వ్యక్త పరిచారు.. అనే అంశాలను కూడా మీడియా హైలెట్ చేస్తోంది. మొత్తానికి ప్రభాస్ ముచ్చట్లకు మంచి గిరాకీ ఉంది మరి! అందుకే  క్రేజీ కబుర్లు.

Show comments