అందరివాడు..సాయిధరమ్

సాయి ధరమ్ తేజ చాలా స్ట్రాటజిక్ గా ముందుకు వెళ్తున్నట్లున్నాడు. సినిమా రంగంలోని అందరితో కలిసి వుండాలని, అందరివాడు అనిపించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లుంది. మొన్నటికి మొన్న బాలయ్య బాబు వందో సినిమా విడుదల సందర్భంగా విసెష్ చెప్పాడు.

నిన్నటికి నిన్న తన సినిమాకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో క్లాప్ కొట్టించాడు. రేపు తన సినిమా విన్నర్ లో ఫస్ట్ సాంగ్ ను హీరో మహేష్ బాబు చేతుల మీదుగా నెట్ లోకి వదిలే పని పెట్టుకున్నాడు. మొత్తం మీద తాను అందరివాడనని చెప్పకనే చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లుంది సాయి ధరమ్ తేజ.

ఎంతయినా మేనమామ పవన్ బాబు అడుగుజాడల్లో నడుస్తున్నాడు. సలహాలు సూచనలు అక్కడి నుంచే అందుతున్నాయేమో? విన్నర్ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించారు. ఈ సినిమా మూడోవారంలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

Show comments