'మగాళ్ల'తో వెళ్లాలంటే అతడికి గాసిప్స్ భయమట!

ఈ మగాళ్ల మహా చిక్కొచ్చిపడుతోందని అంటున్నాడు దర్శకుడు కరణ్ జొహార్. వాళ్లతో కలిసి  కనిపిస్తే చాలు.. మీడియా చిలువలు పలువలు చేసి రాస్తుందని.. దీంతో  మగాళ్లతో కలిసి ఎక్కడికి అయినా వెళ్లాలంటేనే భయమని ఈయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూలో కరణ్ తన పరిస్థితిని చెప్పుకున్నాడు. 

వీకెండ్స్ లో ఎవరితో అయినా పార్టీల్లోనో.. డిన్నర్లలోనో తను కలిసి కనిపిస్తే.. సోమవారం ఉదయాన్నే ఆ ఫొటోలు ఫస్ట్ పేజీల్లో ఉంటాయని కరణ్ బాధపడ్డాడు. తనకూ ఆ మేల్ సెలబ్రిటీలకు సెక్సువల్ రిలేషన్ ఉందన్నట్టుగా ఆ ఫొటోలు ప్రచురిస్తారని.. ఇలాంటివి ఎన్నో జరిగాయని.. కరణ్ ఆవేధన భరితుడయ్యాడు. ప్రత్యేకించి షారూక్ తో తనకు సంబంధం ఉన్నట్టుగా వచ్చిన వార్తలు కలచి వేశాయని చెప్పాడు.

తనకు షారూక్ తండ్రిలాంటి వాడు, సోదరుడిలాంటి వాడని.. అతడితో తనకు ముడి పెట్టారని అన్నాడు. ఒకవైపు తన సెక్సువల్ ఓరియెంటేషన్ గురించి బయోగ్రఫీలో  ప్రత్యేకంగా పేర్కొన్న కరణ్, టీవీలతో మాట్లాడుతూ కూడా ఈ విషయం గురించినే ఆవేధన వ్యక్తం చేస్తున్నాడు. అయినా.. ప్రతి సారీ చెప్పుకోవాల్సిన అవసరం ఏముందో! తెలియని వారికి కూడా తెలియడానికి కాకపోతే ఇదంతా ఏంటి కరణ్! 

Readmore!
Show comments

Related Stories :