నితిన్ సరసన తమిళ మేఘ

నితిన్ - కృష్ణ చైతన్య కాంబినేషన్ లో సినిమాకు పూజ జరిగిపోయింది. కానీ ఇంతకీ అంతకు ముందు ఒకె చేసిన 14రీల్స్-హను రాఘవపూడి సినిమా పరిస్థితి ఏమిటి? అది పక్కన పెట్టారా? లేక దాని తరువాత ఇది చేయడానికి ముందుగా పూజ జరిపించారా? ఈ విషయంలో ఇంకా కాస్త క్లారిటీ రావాల్సి వుందని తెలుస్తోంది. 

ఇప్పటి వరకు అయితే జనవరి నుంచి హను రాఘవపూడి సినిమా సెట్ మీదకు వెళ్లాలన్నది ప్లాన్. ఆ సినిమా 80 శాతం అమెరికా నేపథ్యంలో జరుగుతుంది. అందువల్ల హను అక్కడికి వెళ్లి లోకేషన్ లు అన్నీ ఫైనల్ చేసుకుని, తిరిగి వచ్చారు. హీరోయిన్ గా తమిళ అమ్మాయి మేఘ ను ఫైనల్ చేసారు. 

ఆ అమ్మాయి అక్కడ ధనుష్ తో ఒక సినిమా చేసింది. సో, ఇదీ పరిస్థితి. మరి ఆ సినిమాను జనవరి నుంచి సార్ట్ చేసి, కొంత షూట్ అయిన తరువాత కృష్ణ చైతన్య సినిమా స్టార్ట్ చేస్తారా? లేదా దీని తరువాత అది చేస్తారా? అన్నది ఒకటి రెండు రోజుల్లో డిసైడ్ అవుతుందని తెలుస్తోంది. 

Show comments